Images source : google
ఫుల్ ఎండకు ఒక గ్లాసు చెరుకు రసం తాగితే హాయిగా అనిపిస్తుంది కదా. ఇందులోని చక్కెరలు, పోషక ఖనిజాలు శరీరానికి హాయిని అందిస్తాయి.
Images source : google
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి, శక్తి రావడానికి చెరకు రసం తాగుతారు చాలా మంది. తియ్యగా ఉండే ఈ జ్యూస్ కడుపులోకి అలా వెళ్తుంటే ఆ హాయే వేరు కదా.
Images source : google
చెరకులో పిండిపదార్థాలు, మాంసకృత్తులు ఉంటాయి. అంతేకాదు పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్ లు లభిస్తాయి.
Images source : google
విటమిన్-ఎ, బి, సి లు కూడా లభిస్తాయి. అంతేకాదు చెరుకుతో విటమిన్లతో పాటు ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, సహజ చక్కెరలు కూడా అందుతాయి.
Images source : google
చెరుకులోని సహజ గ్లూకోజ్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. వేసవిలో వడ దెబ్బ నుంచి రిలీఫ్ ను ఇస్తుంది. బలహీనతను తొలగిస్తుంది.
Images source : google
అధిక చెమట రాకుండా చేస్తుంది. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
Images source : google
చెరకు రసం కాలేయానికి మేలు చేస్తుంది. శరీరాన్ని డీటాక్సిఫై చేసి టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. కామెర్ల నివారణకు కూడా మేలే చెరుకు రసం.
Images source : google