Mega DSC: మెగా డీఎస్సీ షెడ్యూల్ రిలీజ్.. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచే!
Mega DSC ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూడా త్వరగా పూర్తి చేసి అభ్యర్ధులకు ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. పరీక్షలు పూర్తయిన రెండో రోజు ప్రాథమిక కీ రిలీజ్ చేస్తారు.

Mega DSC: ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డీఎస్పీ నోటీఫికేషన్‌ను ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ షెడ్యూల్‌ను 16,347 ఉపాధ్యాయ పోస్టులకు రిలీజ్ చేసింది. అయితే ఈ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం అవుతుంది. వీటికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 15. ఇక పరీక్షల విషయానికి వస్తే జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఈ మెగా డీఎస్సీకి సంబంధించిన అన్ని పూర్తి వివరాలు కూడా ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు అన్ని కూడా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉన్నాయి. అయితే పరీక్షల సిలబస్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. అయితే https://cse.ap.gov.in లేదా https://apdsc.apcfss.in వెబ్సైట్లోకి మీకు ఉన్న డౌట్స్‌ను క్లియర్ చేసుకోవచ్చు.
ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూడా త్వరగా పూర్తి చేసి అభ్యర్ధులకు ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. పరీక్షలు పూర్తయిన రెండో రోజు ప్రాథమిక కీ రిలీజ్ చేస్తారు. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి అంతా కూడా ఆన్లైన్. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పరీక్షలు జరిగిన ఏడు రోజుల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వీటి గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది కీని రిలీజ్ చేస్తారు. అక్కడికి వారం రోజుల తర్వాత మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల్లో జిల్లా స్థాయిలో 14,088 ఉండగా, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. వీటితో పాటు బధిర, అంధ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు పేపర్-1గా ఆంగ్ల భాష నైపుణ్యం ఉంటుంది. అయితే 881 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉండగా.. 15 జువెనైల్ పాఠశాలల్లో, 31 పోస్టులు ఉన్నాయి. అయితే వీటిలో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌కి 60 మార్కులు అర్హత సాధించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయితే 50 మార్కులు వస్తే చాలు. ఇక ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులకు అయితే 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వీటీలో టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ద్వారా వెయిటేజీ 20 శాతం ఉంటుంది. ఎక్కువగా కర్నూలు జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 1,817 ఉన్నాయి. ఇక తక్కువగా ప్రకాశం జిల్లాలో 106 పోస్టులు ఉన్నాయి.