Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి సిఐడి పిలుపు.. ఈసారి సంచలనమే!

Vijayasai Reddy:
రాజకీయాలకు ( politics) గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ). వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన కొద్ది రోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. రాజ్యసభ పదవితో పాటు పార్టీ పదవులను వదులుకున్నారు. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన రాజకీయ కామెంట్స్ మానలేదు. ఆయనను పాత కేసులు విడవడం లేదు. గతంలో కాకినాడ సి పోర్టు వాటాల బదిలీ కి సంబంధించి విజయసాయిరెడ్డి బెదిరింపులకు దిగారు అన్నది ప్రధాన ఆరోపణ. ఎప్పటికే దీనిపై సిఐడి విచారణ చేపట్టింది. విచారణకు హాజరైన అనంతరం మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. మరోసారి విజయసాయి రెడ్డికి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వడం విశేషం. దీంతో ఈసారి ఎటువంటి ప్రకటనలు చేస్తారో అన్నది హాట్ టాపిక్ గా మారుతోంది.
CID summons Vijayasai Reddy
* ప్రధాన ఆరోపణలు అవే
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో కాకినాడ సీ పోర్టు యజమాని కె.వి. రావును బెదిరించారని.. పోర్టును అక్రమంగా రాయించుకున్నారని.. తన సమీప బంధువులకు కట్టబెట్టారన్న ఆరోపణలు విజయసాయిరెడ్డి పై ఉన్నాయి. ఇప్పటికే ఒకసారి ఆయనను సిఐడి విచారించింది. విచారణకు హాజరైన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాకినాడ సి పోర్టునకు సంబంధించి వై వి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. అందులో తన పాత్ర లేదని తేల్చి చెప్పారు. ఈ కేసునకు సంబంధించి ఎటువంటి వివరాలు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇటువంటి తరుణంలో ఈ నెల 25న మరోసారి విచారణకు రావాలని సిఐడి రాజాగా నోటీసులు పంపింది. కాగా ఈ కేసులో విజయసాయిరెడ్డి తో పాటు మొత్తం ఆరుగురిపై కేసు నమోదు అయ్యింది.
* వైవి కుమారుడు సూత్రధారి
కాకినాడ సి పోర్టు( Kakinada seaport ) వాటాల బదలాయింపు వెనుక వైవి సుబ్బారెడ్డి హస్తం ఉందన్నది విజయసాయిరెడ్డి ఆరోపణ. వై వి సుబ్బారెడ్డి తో కె.వి. రావు అత్యంత సన్నిహితంగా ఉండేవారని.. ఈ మొత్తం వ్యవహారం వై విక్రాంత్ రెడ్డి చూశారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. అలాగే లిక్కర్ స్కాం గురించి కూడా గతంలో మీడియా ముందు సంచలన విషయాలు బయట పెట్టారు విజయసాయిరెడ్డి. కాకినాడ సి పోర్టుతో పాటు లిక్కర్స్ స్కామ్ లో తన పాత్ర ఏమీ లేదని.. జగన్ చుట్టూ ఉన్న కోటరితో ఇబ్బందులు పడి తాను బయటకు వచ్చానని వెల్లడించారు విజయసాయిరెడ్డి. కోటరీని నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి నిండా మునగాడం ఖాయమని కూడా తేల్చి చెప్పారు. వై వి సుబ్బారెడ్డి తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి తీరుతోనే తాను పార్టీ నుంచి బయటకు వచ్చానని అప్పట్లో చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి.
* 25న విచారణకు
ఈనెల 25న విజయసాయిరెడ్డి సిఐడి ( CID) విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో విచారణ చేసే సమయంలోనే సిఐడి అధికారులు మరోసారి రావాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డికి చెప్పారట. అయితే ఈసారి విజయసాయిరెడ్డి విచారణకు హాజరైతే ఎవరి పేరు చెబుతారు? మీడియా ముందు సంచలన విషయాలు బయటపెడతారా? అన్నది ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. కచ్చితంగా కూటమి ట్రాప్ లో విజయసాయిరెడ్డి ఉన్నారని.. తప్పకుండా సంచలన విషయాలు బయట పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.