Motorola Laptop: మోటోరోలా నుంచి ఫస్ట్ ల్యాప్ టాప్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు భయ్యా
Motorola Laptop ఈ మోటో బుక్ 60లో మంచి డిస్ప్లే ఉంది. అయితే ఇందులో 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా ఉంది. అయితే డాల్బీ విజన్, హెచ్‌డిఆర్, టియువి సర్టిఫికేషన్లతో ఈ మోటో బుక్ వస్తోంది. దీనికి ఐ- ఫ్రెండ్లీ విజువల్స్‌ను కూడా అందించారు.

Motorola Laptop: మోటోరోలా కంపెనీ నుంచి ఏ మొబైల్ వచ్చినా కూడా మంచి ఫీచర్లు ఉంటాయి. ఈ కంపెనీ మొబైల్స్ అయితే చాలా బెస్ట్‌గా ఉంటాయి. కెమెరా క్వాలిటీ, బ్యాటరీ పవర్ ఇలా చూసుకుంటే అంతా కూడా బానే ఉంటుంది. అయితే ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి మొదటి ల్యాప్‌టాప్ వస్తోంది. మోటో బుక్ 60 ల్యాప్‌టాప్‌తో పాటు మోటో ప్యాడ్ 60 ప్రో ఇటీవల విడుదలు చేసింది. బెస్ట్ ఫీచర్లతో ల్యాప్‌టాప్‌ను లాంఛ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లో బ్రాంజ్ గ్రీన్, వెడ్జ్ వుడ్ అనే రెండు కలర్లను తీసుకొచ్చింది. ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాల 2.8కే ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండగా.. 60 వాట్స్ బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. దీనికి స్మార్ట్ కనెక్ట్ ఉంటుంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌లో చాలా ఫీచర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని బెస్ట్ ఫీచర్ల వల్ల ల్యాప్‌ట్యాప్ బాగుంటుందని టాక్ వినిపిస్తోంది.
ఈ మోటో బుక్ 60లో మంచి డిస్ప్లే ఉంది. అయితే ఇందులో 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా ఉంది. అయితే డాల్బీ విజన్, హెచ్‌డిఆర్, టియువి సర్టిఫికేషన్లతో ఈ మోటో బుక్ వస్తోంది. దీనికి ఐ- ఫ్రెండ్లీ విజువల్స్‌ను కూడా అందించారు. ఈ ల్యాప్‌టాప్ 100 శాతం డిసిఐ-పి3 కలర్ గేమట్తో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కూడా సపోర్ట్ చేస్తోంది. ఈ ల్యాప్‌టాప్ 1.39 కిలోల బరువు ఉంటుంది. ఇందులో ఆల్మెటల్, మిలిటరీ గ్రేడ్ కేస్ కూడా ఉంటుంది. ఇది టూ బెస్ట్ కలర్లో మాత్రమే ఉంది. ఈ మోటరోలా బుక్ 60 ఇంటెల్ కోర్ 5 అనేది 210 హెచ్, కోర్ 7 అనేది 240 హెచ్ ప్రాసెసర్లతో బాగా వర్క్ అవుతుంది. దీనికి 16 జీబీ డిడిఆర్ 5 ర్యామ్ ఉంటుంది. అలాగే 1 టీబీ వరకు పిసిఐఇ స్టోరేజ్‌తో వస్తుంది. అయితే ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11తో పనిచేస్తుంది. అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్, స్టూడెంట్ 2024తో వచ్చింది.
ఈ మోటోరోలా ల్యాప్ట్యాప్కి స్మార్ట్ కనెక్ట్ ఉంటుంది. అలాగే మల్టీ డివైజ్ సింక్ టెక్నాలజీ కూడా ఉంది. దీన్ని ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్లుగా కూడా వాడుకోవచ్చు. దీన్ని ఇతర పరికరాలతో కూడా ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. ఇది అన్ని విధాలుగా కూడా కనెక్షన్లను ఇస్తుంది. దీనిలో ఇంటెల్ కోర్ 5, 16 జిబి ర్యామ్‌తో ఉండి 512 జిబి స్టోరేజ్‌తో ఉన్న ధర అయితే రూ.61,999 గా ఉంది. అదే ఇంటెల్ కోర్ 7 తో 16 జిబి ర్యామ్‌తో ఉన్న 512 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర అయితే రూ.69,999గా ఉంది. అయితే ఈ ల్యాప్‌ట్యాప్ ఇండియన్ మార్కెట్లోకి ఏప్రిల్ 23వ తేదీ నుంచి లభ్యమవుతుంది.