Flight ticket : కేవలం రూ.1499 లకే ఫ్లైట్ టికెట్.. ఇండిగో సమ్మర్ స్పెషల్
Flight ticket: ఈ టైంలో విమాన ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. నిజం చెప్పాలంటే ఉన్న ధరల కంటే రెట్టింపు ధరలు ఈ సమ్మర్ టైంలో చేస్తారు. కానీ ఇండిగో సంస్థ మాత్రం సమ్మర్ స్పెషల్‌గా విమాన ధరలను తగ్గించింది. కేవలం రూ.1499 లకే ఫ్లైట్ టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. మరి ఎక్కడ నుంచి ఎక్కడికి ఫ్లైట్‌లో బుక్ చేసుకోవచ్చో ఈ స్టోరీలో చూద్దాం.

Flight ticket : జీవితంలో ఒక్కసారైన విమాన ప్రయాణం చేయాలని కొందరు భావిస్తారు. అయితే సాధారణంగానే విమాన ధరలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ ఏదైనా స్పెషల్ డేట్స్, సెలవులు అంటే చాలు.. ఈ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. దీంతో చాలా మంది విమానంలో ప్రయాణించాలనే వారి కోరికను చంపేసుకుంటారు. ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టడం అని కొందరు ఆలోచించి పెద్దగా విమాన ప్రయాణాలకు ఇంట్రెస్ట్ చూపించరు. కొందరు అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఎంత ఖరీదు పెట్టి అయిన వెళ్తుంటారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. దీంతో ఈ సమయంలో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఈ టైంలో విమాన ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. నిజం చెప్పాలంటే ఉన్న ధరల కంటే రెట్టింపు ధరలు ఈ సమ్మర్ టైంలో చేస్తారు. కానీ ఇండిగో సంస్థ మాత్రం సమ్మర్ స్పెషల్‌గా విమాన ధరలను తగ్గించింది. కేవలం రూ.1499 లకే ఫ్లైట్ టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. మరి ఎక్కడ నుంచి ఎక్కడికి ఫ్లైట్‌లో బుక్ చేసుకోవచ్చో ఈ స్టోరీలో చూద్దాం.
ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన ప్రయాణికులకు సమ్మర్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి తక్కువ రేటుకే విమాన ప్రయాణం కల్పిస్తోంది. ఇండిగో సమ్మర్ సేల్ పేరుతో బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణాన్ని కల్పిస్తోంది. అలాగే కొన్ని రకాల సేవలపై దాదాపుగా 50 శాతం వరకు డిస్కౌంట్‌ను కూడా ప్రకటిస్తోంది. ఇండిగో సమ్మర్ సేల్ ద్వారా కేవలం రూ.1499కే ఈజీగా విమాన ప్రయాణం చేయవచ్చు. అయితే ఈ సమ్మర్ సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యింది. నేటి అర్థరాత్రితో సమ్మర్ సేల్ పూర్తి అవుతుంది. అర్థరాత్రిలోకా ఎక్కడికైనా వెళ్లాలంటే టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ సమ్మర్ సేల్‌లో దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ.1499కే ఇస్తోంది. అయితే మీరు ఎంపిక చేసిన రూట్ల బట్టి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ధరకు ఫ్లైట్ టికెట్ లభిస్తోంది. కడప, కర్నూలు, హైదరాబాద్, చెన్నైల నుంచి రూ.1499కే మీరు విమాన ప్రయాణం చేయవచ్చు. మీరు కడప నుంచి హైదరాబాద్, కడప నుంచి చెన్నై, చెన్నై నుంచి కర్నూల్, కడప నుంచి విజయవాడ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా కూడా కేవలం రూ.1499 చెల్లిస్తే సరిపోతుంది. అయితే మీరు టికెట్ బుక్ చేసుకున్న వారం తర్వాత మీ ప్రయాణం ఉంటేనే ఈ సమ్మర్ ఆఫర్ వర్తిస్తుంది. లేకపోతే మీకు సమ్మర్ ఆఫర్ వర్తించదు.
మీరు టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఇండిగో అధికారిక వెబ్సైట్ goindigo.in లోకి వెళ్లాలి. లేదా ఇండిగో మొబైల్ యాప్, ఇండిగో 6ESKai, ఇండిగో వాట్సాప్ నంబర్ 7065145858కి అయినా సంప్రదించవచ్చు. అయితే మీరు ఏజెంట్ల ద్వారా కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ స్పెషల్ ఆఫర్ ఈ రోజుతోనే ఎండ్.. కాబట్టి ఆలస్యం చేయకుండా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకుని వెంటనే టికెట్లు బుక్ చేసుకోండి.