Expensive Cocktail: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాక్టెయిల్.. ధర ఎంతో తెలిస్తే షాక్ కావాల్సిందే
ఈ ప్రపంచంలో ఖరీదైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఒకోక్కరి స్తోమతను బట్టి కొనుగోలు చేస్తుంటారు. అయితే సాధారణంగా అందరూ కూడా కాక్టెయిల్ తాగుతుంటారు. మహా అయితే కాక్టెయిల్ ఒక వెయ్యి లేదా రెండు వేలు ఉంటుంది.

Expensive Cocktail: ఈ ప్రపంచంలో ఖరీదైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఒకోక్కరి స్తోమతను బట్టి కొనుగోలు చేస్తుంటారు. అయితే సాధారణంగా అందరూ కూడా కాక్టెయిల్ తాగుతుంటారు. మహా అయితే కాక్టెయిల్ ఒక వెయ్యి లేదా రెండు వేలు ఉంటుంది. ఎంత కాదనుకున్నా కూడా వేల వరకు మాత్రమే ఉంటుంది. కానీ విన్స్టన్ అనే కాక్టెయిల్ ధర మాత్రం రూ.35 లక్షలు ఉంది. దీన్ని బక్కారట్లో ప్రదర్శించారు. ఈ ఖరీదైన కాక్టెయిల్ మిశ్రమాన్ని మిక్సాలజిస్ట్ సాల్వటోర్ కాలాబ్రేస్ రూపొందించారు. ఇది 1950 నాటిది. ఇందులో అంగోస్టూరా బిట్టర్స్ వంటి అరుదైన పదార్థాలు ఉన్నాయి. అయితే దీన్ని బాక్కరట్ క్రిస్టల్ గ్లాస్లో అందించారు. అయితే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కాక్టెయిల్ ఈవెంట్లో దీన్ని ప్రదర్శించారు. ఈ కాక్టెయిల్ అత్యంత ఖరీదైన కాక్టెయిల్గా గుర్తింపు పొందింది. ఈ కాక్టెయిల్ను కారామెల్, వనిల్లా, వెన్న, స్టోన్ ఫ్రూట్ వంటి వాటితో తయారు చేశారు. అయితే ఇంతటి ఖరీదైన కాక్టెయిల్ను ఎక్కువగా రిచెస్ట్ పర్సన్స్ మాత్రమే కొనుగోలు చేయగలరు. ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి మరి ఎవరూ తాగుతారు. కేవలం ధనవంతులు మాత్రమే తాగగలరు.
Read also: కలలో ఇవి కనిపిస్తే.. కోరుకున్న ఉద్యోగం రావడం ఖాయం
ఈ ఖరీదైన కాక్టెయిల్ను దుబాయ్‌కు చెందిన మోడల్, వ్యవస్థాపకురాలు డయానా అహద్పూర్ ఇందులో కొనుగోలు చేసింది. అయితే ఈ కాక్టెయిల్ ప్రారంభ ధరను 60,000 వేల దిలార్లు. అయితే ఇది ఇప్పుడు భారీ రేటుకి వెళ్లింది. 1937లో తయారు చేసిన ఈ కాక్టెయిల్ చాలా ప్రత్యేకమైనది. దీన్ని ప్రత్యేకమైన క్రిస్టల్ నుంచి తయారు చేయడంతో ఇది బాగా ఫేమస్ అయ్యింది. అయితే ఈ క్రిస్టల్‌ను పారిస్ నుంచి దుబాయ్‌కు తీసుకుని వచ్చారు. కాక్టెయిల్ కొనుగోలుదారునికి ఈ ప్రత్యేక గ్లాసులను స్మారక చిహ్నంగా అందజేశారు.
Read Also: సమ్మర్లో దొరికే ఈ ఫ్రూట్ తింటే.. రోగాలన్నీ పరార్
మాస్టర్ డిస్టిలర్ ఈ బ్లెండ్ను కేవలం 500ml వరకు మాత్రమే తయారు చేశారు. అయితే దీన్ని ఈవెంట్‌కు ముందు మెక్సికో నుంచి తీసుకుని వచ్చారు. దీని కోసం ప్రత్యేకంగా కినా లిల్లెట్ను కూడా ఉపయోగించారట. దీనిని జేమ్స్ బాండ్ 007 కోసం రూపొందించిన కాక్టెయిల్ అసలు రెసిపీలో వాడారు. వారు ఇకపై అసలు వెర్షన్‌ను ఉత్పత్తి చేయరు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని సీసాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మాకు లభించిన బాటిల్ 1950ల నాటిది. అని పేర్కొన్నారు. 1930ల నాటి అంగోస్టూరా బిట్టర్స్ అనే ప్రత్యేక డ్రింక్ ను సూపర్ ఎక్స్‌క్లూజివ్ సర్వ్ కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. అయితే, ఈ డ్రింక్ ను ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ బార్టెండర్లలో ఒకరైన సాల్వటోర్ ది మాస్ట్రో కాలాబ్రేస్ కలిపారు.