Management: మేనేజ్మెంట్కి తప్పకుండా ఉండాల్సిన లక్షణాలివే
Management మేనేజ్మెంట్కి ఎంప్లాయిస్ మీద ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఉద్యోగులు కనీసం వర్క్ చేయలేరు. అలాగే అందరిని కూడా సమానంగా చూడాలి.

Management: ఏదైనా సంస్థను ప్రారంభించారంటే తప్పకుండా కొన్ని లక్షణాలు ఉండాలి. ఏదో ప్రారంభించాం.. నోటికి ఏది వస్తే అది ఎంప్లాయిస్ను అనేకూడదు. కొందరు జీతం ఇస్తున్నారని టార్చర్ పెట్టినా కూడా భరిస్తారు. ఇలా ఎన్ని మాటలు అన్నా కూడా భరిస్తున్నారని.. చిన్న తప్పు చేసినా కూడా ఏం అనకుండా ఉండరు. ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అయితే ఈ రోజుల్లో మేనేజ్మెంట్ చాలా కమర్షియల్గా మారిపోయింది. ఎందుకంటే ఎంప్లాయిస్ ఎంత కష్టపడి పనిచేసినా కూడా పట్టించుకోవు. వారి కష్టాన్ని గుర్తించవు. వారికి ఏదైనా సమస్య వచ్చినా కూడా పట్టించుకోకుండా వర్క్ చేయమంటాయి. అంతే కానీ ఆరోగ్యం బాలేదని లీవ్ తీసుకోమని చెప్పవు. ఆరోగ్యం బాలేదని లీవ్ కావాలని అడిగినా కూడా ఇవ్వవు. అయితే కొన్ని కంపెనీలు ఎంప్లాయిస్ను పట్టించుకుంటాయి. ఏ మాత్రం మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే మాత్రం ఎంప్లాయిస్ ఉద్యోగం మానేస్తారు. అయితే మేనేజ్మెంట్కి తప్పకుండా ఉండాల్సిన లక్షణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
కూర్మీ
మేనేజ్మెంట్కి ఎంప్లాయిస్ మీద ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఉద్యోగులు కనీసం వర్క్ చేయలేరు. అలాగే అందరిని కూడా సమానంగా చూడాలి. ఒకరిని ఒకలా, ఇంకోకరిని ఒకలా చూడకూడదు. ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఉండాలి. అందరినీ కూడా ఒకేలా చూస్తూనే ఎంప్లాయిస్ చక్కగా వర్క్ చేస్తారు. వారికి కూడా ఉద్యోగం చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతీ మేనేజ్మెంట్ కూడా ఉద్యోగులతో ప్రేమగానే ఉండాలి.
నేర్మీ
ఉద్యోగులపై నైపుణ్యం కూడా ఉండాలి. అంటే మేనేజ్మెంట్ ఉద్యోగులతో మంచిగా మాట్లాడే నైపుణ్యం వచ్చి ఉండాలి. అప్పుడే ఉద్యోగులకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎంత గౌరవం ఇవ్వాలి? అనే పూర్తి వివరాలు కూడా తెలిసి ఉండాలి. మీరు ఉద్యోగులకు ఎంత గౌరవం ఇస్తారో.. వారు కూడా మీకు అంతే గౌరవం ఇస్తారు.
ఓర్మీ
మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నవారికి తప్పకుండా సహనం ఉండాలి. వర్క్ విషయంలో ఏదో తొందరగా చేసేస్తామని అనకూడదు. ఓపిక ఉంటేనే అన్ని పనులు కూడా జరుగుతాయి. కొన్ని మేనేజ్మెంట్లు అసలు వర్క్ విషయంలో టార్గెట్స్ పెడుతుంటాయి. ఎన్ని టార్గెట్లు పెట్టినా కూడా పనులు కావాల్సిన సమయానికే అవుతాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా మేనేజ్మెంట్కి కాస్త సహనం ఉండాలి.