UPI Payments: నిలిచిపోయిన యూపీఐ సేవలు.. ఎందుకంటే?
UPI Payments : యూపీఐ సేవలు వచ్చిన తర్వాత చాలా పనులు మరింత వేగవంతం అయ్యాయి. అయితే ఈ యూపీఐ ఒక్క పది నిమిషాల పాటు పనిచేయకపోతే మాత్రం తప్పకుండా కష్టమే. ఈ యూపీఐ పేమెంట్స్‌లో ఎక్కువగా ఫోన్‌పే వాడుతున్నారు. దీని తర్వాత గూగుల్ పే, పేటీఎమ్ వంటివి వాడుతున్నారు. అన్నింటికి వీటిని వాడటంతో ఎప్పుడైనా కూడా సర్వర్ ఆగిపోతే మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు.

UPI Payments : ప్రస్తుతం మనం స్మార్ట్ ఫోన్ యుగంలో నడుస్తున్నాం. అన్నింటికి కూడా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నాం. ఏదైనా వస్తువు కొనాలన్నా కూడా యూపీఐ చేస్తు్న్నాం. ఆఖరికి ఒక రూపాయి వస్తువు కొన్నా కూడా యూపీ వాడుతున్నాం. బయటకు వెళ్లకుండా ఈ యూపీఐ ద్వారా ఇంటి నుంచే అన్ని ఆర్డర్లు చేసుకుంటున్నారు. యూపీఐ సేవలు వచ్చిన తర్వాత చాలా పనులు మరింత వేగవంతం అయ్యాయి. అయితే ఈ యూపీఐ ఒక్క పది నిమిషాల పాటు పనిచేయకపోతే మాత్రం తప్పకుండా కష్టమే. ఈ యూపీఐ పేమెంట్స్‌లో ఎక్కువగా ఫోన్‌పే వాడుతున్నారు. దీని తర్వాత గూగుల్ పే, పేటీఎమ్ వంటివి వాడుతున్నారు. అన్నింటికి వీటిని వాడటంతో ఎప్పుడైనా కూడా సర్వర్ ఆగిపోతే మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు.
ఇలానే ఒక్కసారిగా దేశంలో యూపీఐ సేవలు నిలిచిపోయాయి. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా యూపీఐ సేవలు దేశ వ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని నిమిషాలు కాదు సెకన్ల పాటు యూపీఐ నిలిచిపోయినా కూడా కష్టమే. ఎందుకంటే ప్రజలు యూపీఐకి బాగా అలవాటు పడ్డారు. ఏ పని చేసినా కూడా యూపీఐ చేస్తున్నారు. ఒక్కసారిగా సర్వర్ డౌన్ అయిపోతే యూజర్లు ఇబ్బంది పడ్డారు. కనీసం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కూడా కుదరలేదు. సర్వర్ డౌన్ అని చూపించింది. వీటితో పాటు ఎస్బీఐ సర్వర్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకుల సేవలు మాత్రమే ఉన్నాయి. మిగతా బ్యాంకు యూపీఐ సేవలు అన్ని కూడా నిలిచిపోయాయి.
దేశ వ్యాప్తంగా ఇలా సేవలు నిలిచిపోవడంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా స్పందించింది. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందని, కేవలం ఇది తాత్కాలిక సమస్య అని తెలిపింది. కొన్ని నిమిషాలు మాత్రమే యూపీఐ పేమెంట్స్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ ఎప్పటిలానే జరుగుతున్నాయి. ఇకపై యూపీఐ పేమెంట్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో యూజర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రోజుల్లో నెట్ క్యాష్ వాడే వారి సంఖ్య భారీగా తగ్గింది. అందరూ కూడా డిజిటల్ పేమెంట్స్‌కి బాగా అలవాటు పడి అసలు చేతిలో డబ్బులు పెట్టుకోవడం లేదు.
ఒక్కసారిగా యూపీఐ పేమెంట్స్ నిలిచిపోవడంతో 83 శాతం మంది యూజర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఇంకో 13 శాతం మంది ఇతరులకు డబ్బులు పంపడానికి ఇబ్బంది పడ్డారు. సర్వర్ డౌన్ కావడం వల్ల ఈ సమస్య వచ్చిందని తెలిపింది. వెంటనే ఈ సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూపీఐ పేమెంట్స్ అవుతున్నాయి. ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి చేతులో డబ్బులు పెట్టుకోండి. చిన్న అవసరాలకు అయినా కూడా ఉపయోగపడతాయి.