Aurangzeb : 300 ఏళ్ల ఔరంగజేబు సమాధిపై ఇప్పుడెందుకు వివాదం?

Aurangzeb :
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడో 300 ఏళ్ల క్రితం మరణించిన ఔరంగజేబు సమాధిపై ఇప్పుడు వివాదం చెలరేగింది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ కొన్ని హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టారు. ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కార్యకర్తలు నాగ్‌పూర్‌లో మహల్ ఏరియాలో నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో వారు ముస్లింల పవిత్రమై గ్రంధం ఖురాన్‌ను కాల్చివేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో రెండు వర్గాల వారికి గొడవలు జరిగాయి. ఒకరినొకరిపై దాడులు చేసుకోవడానికి పాల్పడ్డారు. రోడ్డుపై ఉన్న వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు కొన్నింటికి నిప్పు అంటించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి భాష్పవాయువు ప్రయోగించి పరిస్థితులను అదుపులోకి తీసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అయితే అసలు ఇప్పుడు ఔరంగజేబు సమాధి విషయం ఎందుకు తెర మీదకు వచ్చింది? ఇది తెర మీదకు రావడానికి గల కారణాలేంటో చూద్దాం.
బాలీవుడ్లో ఇటీవల ఛత్రపతి మహారాజ్ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఛావా అనే సినిమా రిలీజ్ అయ్యింది. అసలు వివాదం ఇక్కడే స్టార్ట్ అయ్యింది. మరాఠా పాలకుడు అయిన ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను ఔరంగజేబు ఉరితీయడంతో పాటు దేశంలో ఉన్న పలు హిందూ దేవాలయాలపై దాడి చేయడం, వాటిని కూల్చి వేయడం వంటివి ఆ సినిమాలో చూపించారు. దీంతో కొందరు హిందూ పరిషత్ కార్యకర్తలు ఔరంగజేబు సమాధిని ధ్వంసం చేయాలని నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో ముస్లింల పవిత్రమైన ఖురాన్ కాల్చివేశారని ఆరోపణలు రావడంతో రెండు వర్గాల మధ్య అల్లర్లు ప్రారంభమయ్యాయి. దీనిపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా స్పందించారు. ఔరంగజేబు సమాధిని కావాలంటే కూల్చవచ్చని కాకపోతే సి నాయుడు, నితీష్ కుమార్‌లు ఉండాలన్నారు. అయితే ఠాక్రే బీజేపై విమర్శలు చేశారు.
ఔరంగజేబు గుజరాత్లో జన్మించాడని, కాకపోతే 1707 మహారాష్ట్రలోని భింగర్ సమీపంలో మరణించారన్నారు. ఎప్పుడో 300 ఏళ్ల క్రితం చనిపోయిన ఔరంగజేబు సమాధి కోసం ఇప్పుడు వివాదం ఏంటని, బీజేపీ కావాలని రెండో మణిపూర్ చేయాలని భావిస్తుందని ఆరోపించారు. చరిత్రను తవ్వుతున్నారని, కానీ భవిష్యత్తు, వర్తమానం గురించి ఆలోచించం లేదన్నారు. అలాగే ఆ సమాధిని ఇంకా ప్రభుత్వం రక్షిస్తోందన్నారు. ఔరంగజేబు సమాధి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. లోపలికి వెళ్లాలంటే ఐడీ కార్డు చూపిస్తేనే అనుమతి ఇస్తున్నారు. ప్రస్తుతం అక్కడ అన్ని భద్రతలను కూడా స్ట్రిట్ చేశారు. అనుమానం ఉన్న వ్యక్తులను లోపలికి పోనివ్వడం లేదు. ఎందుకంటే ఎవరైనా సమాధి కూల్చేస్తారు ఏమోనని అందరినీ చెక్ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. ఈ వివాదం ఇంకా ఎంత వరకు ముదురుతుందో, దేశంలో ఇంకా ఎన్ని అరాచకాలు జరుగుతాయోనని అంటున్నారు. కొందరు ఔరంగజేబు సమాధి కోసం ఒకరినొకరు దాడి చేసుకోవడం ఏంటని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.