NEET PG 2025 Notification: నీట్ పీజీ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. చివరి తేదీ ఎప్పుడంటే?
NEET PG 2025 Notification ఈ పరీక్షకు దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 16న అవుతుంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ మే 7వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు కూడా ఈ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు.

NEET PG 2025 Notification: యువత విద్య, పరిశోధన రంగాల్లో కెరీర్ చేయాలనుకునే వారికి ఒక శుభవార్త. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ (UGC) జాతీయ అర్హత పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ పరీక్షకు అప్లై చేసుకున్న తర్వాత జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవులు నిర్వహిస్తారు. పీజీ చేసి ఆసక్తి ఉన్న అభ్యర్థులు NTA అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ugcnet.nta.ac.in అనే వెబ్సైట్లోకి వెళ్లి మే 7వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. అయితే ఈ UGC NET పరీక్షను జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత మోడ్ (CBT) లో నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షలు మొత్తం 85 సబ్జెక్టుల్లో జరుగుతుంది. అయితే దరఖాస్తు సమయంలో ఇచ్చిన వివరాలకు పరీక్ష ముందు పూర్తి వివరాలు వస్తాయి.
ఈ పరీక్షకు దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 16న అవుతుంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ మే 7వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు కూడా ఈ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఫీజు చెల్లించడానికి మే 8వ తేదీ చివరి తేదీ. మీరు ఇందులో వివరాలు సవరించుకోవడానికి కూడా సమయం ఉంటుంది. మే 9, 10వ తేదీల్లో సవరించుకోవచ్చు. అయితే ఫీజులు చెల్లించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీటికి ఓసీ అభ్యర్థులు రూ.1150 రూపాయల ఫీజు చెల్లించాలి. EWS/OBC వాళ్లు అయితే తప్పకుండా రూ. 600 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, థర్డ్ జెండర్ అభ్యర్థులు అయితే రూ.325 రూపాయలు చెల్లించాలి. వీటికి గరిష్ట వయస్సు 2025 జూన్ 1వ తేదీ నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఇంతకంటే ఎక్కువ వస్తే మాత్రం అర్హులు కారు. అయితే కొన్నింటికి వయో పరిమితి ఉంటుంది. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD ప్రోగ్రామ్‌ల వారికి అయితే అసలు ఎలాంటి వయోపరిమితి లేదు. అయితే పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు.
https://ugcnet.nta.ac.in లేదా www.nta.ac.in వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేయాలి. ఈ లింక్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత వ్యక్తిగత, విద్యా, పరీక్ష వివరాలు అన్ని కూడా ఫిల్ చేయాలి. ఆ తర్వాత పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం వంటి అన్ని పత్రాలు కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత డెబిట్/క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అంతే ఇక మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.