Open Tenth Inter Exams: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎప్పటి నుంచంటే?
Open Tenth Inter Exams: ప్రతీ ఒక్కరూ కూడా చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని కలలు కంటారు. కొందరికి సమయం లేక, డబ్బులు లేక మరికొందరు పూర్తిగా చదువుకోరు.

Open Tenth Inter Exams: ప్రతీ ఒక్కరూ కూడా చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని కలలు కంటారు. కొందరికి సమయం లేక, డబ్బులు లేక మరికొందరు పూర్తిగా చదువుకోరు. ఎంత గొప్ప చదువులు చదవకపోయినా కూడా కనీసం పదవ తరగతి అయినా పాస్ అయి ఉండాలి. మినిమం ఈ మాత్రం కూడ చదవకపోతే ఈ రోజుల్లో చాలా కష్టం. అయితే నిజానికి పదవ తరగతి వరకు చాలా మంది రెగ్యులర్‌గానే చదువుతుంటారు. ఆ తర్వాత పై చదువులకు అయితే కరస్పాండెంట్‌గా చదువుతారు. అయితే కొందరికి ఉన్న ఆర్థిక సమస్యల వల్ల ఎక్కువ మంది పదవ తరగతికి కూడా స్కూల్ కి వెళ్లి చదవలేకపోతుంటారు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం ఓపెన్ పరీక్షలను తీసుకొచ్చింది. వీటికి ఫీజు కడితే మీరు డైలీ స్కూల్‌కి వెళ్లక్కర్లేదు. పరీక్షలు ఉన్న సమయంలో మాత్రమే వెళ్తే సరిపోతుంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్ పరీక్షల హెడ్యూల్‌ను విడుదల చేసింది. ఓపెన్ టెన్త్, ఇంటరీ పరీక్షలకు ఫీజు కట్టిన వారు ఈ పరీక్షలకు అటెండ్ కావాలి. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకో ఈ స్టోరీలో చూద్దాం.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలను విడుదల చేసింది. ఏప్రిల్, మే వరకు రెండు సెషన్స్‌లో పరీక్షలు అవుతాయి. అయితే ఓపెన్ ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీన ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ 26వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయి. అయితే వీటికి సంబంధించిన హాల్ టికెట్లను త్వరలోనే విడుదల చేస్తారు. అయితే థియరీ పరీక్షలు మొత్తం రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షను నిర్వహిస్తారు. అయితే ఇంటర్ వాళ్లకు ప్రాక్టీకల్స్ కూడా ఉంటాయి. ఇవి ఏప్రిల్ 26వ తేదీన స్టార్ట్ అయ్యి.. మే 3వ తేదీ వరకు జరగుతాయి. ఇక పదవ తరగతి పరీక్షలు అయితే ఈ నెల 21వ తేదీ నుంచి జరగనున్నాయి. ఇవి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 4.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పదవ తరగతి రెగ్యులర్ పరీక్షలు ఈ నెల నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ పదవ తరగతి పరీక్షలను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తారు.