Hug: తల్లి బిడ్డకు ఇచ్చే ఒక్క కౌగిలింతతో ఇన్ని ప్రయోజనాలా?
Hug తల్లిదండ్రులు పిల్లలకు కౌగిలింతలు ఇవ్వడం వల్ల వారు అన్ని విధాలుగా కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. ముఖ్యంగా తల్లి పిల్లలకు హగ్ ఇస్తే వారి కమ్యూనికేషన్, ప్రవర్తన అన్నింటిలో కూడా మార్పులు కనిపిస్తాయి.

Hug: కౌగిలింత మనిషిని ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది. అందులోనూ తల్లిదండ్రులు పిల్లలకు రోజూ ఒక హగ్ ఇస్తే వారికి మానసికంగా, శారీరకంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందట. నిజానికి పిల్లలకు చిన్నప్పుడు చాలా విషయాలు తెలియదు. వారికి ఎవరు ఏం చెప్పినా వినేస్తుంటారు. అయితే చిన్నతనంలో పిల్లలు శారీరకంగా, మానసికంగా కూడా ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడతారు. వీటివల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. నిజానికి పిల్లలను చిన్నతనంలో అన్ని విధాలుగా కూడా ఆరోగ్యంగా ఉంటేనే వారు భవిష్యత్తులో ఎలాంటి విషయాలను అయినా కూడా తట్టుకుని ఎదుర్కొనగలరు. కేవలం చిన్నతనంలోనే కాకుండా పెద్దయ్యాక కూడా పిల్లలు చాలా సమస్యలో ఎదుర్కుంటారు. ఈ సమయంలో వారికి తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని అనుకుంటారు. అందులోనూ వారి బాధను తట్టుకుని నిలబడాలంటే ఎవరైనా కూడా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తి కావాలని అనుకుంటారు. అయితే ఏ వయస్సులో అయినా కూడా తల్లిదండ్రులు పిల్లలకు ఒక హగ్ ఇస్తే బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి తల్లి బిడ్డకు ఇచ్చే ఒక కౌగిలింత వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ స్టోరీలో చూద్దాం.
తల్లిదండ్రులు పిల్లలకు కౌగిలింతలు ఇవ్వడం వల్ల వారు అన్ని విధాలుగా కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. ముఖ్యంగా తల్లి పిల్లలకు హగ్ ఇస్తే వారి కమ్యూనికేషన్, ప్రవర్తన అన్నింటిలో కూడా మార్పులు కనిపిస్తాయి. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఒక్క హగ్ వల్ల పిల్లలో ఆత్మవిశ్వాసం మెరుగుపడటంతో పాటు నమ్మకం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎంత ప్రేమగా ఉంటే వారి లైఫ్ అంతా బాగుంటుంది. ఇలా ఎక్కువగా ప్రేమ చూపిస్తే పిల్లలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. దీన్నే లవ్ హార్మోన్ అని కూడా అంటారు. అయితే ఈ లవ్ హార్మోన్ వల్ల పిల్లల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. అలాగే వారిలో ఆందోళన, నిరాశ వంటివి కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు డైలీ ఒక హగ్ ఇస్తే మాత్రం వారు అన్ని విధాలుగా కూడా మంచిగా ఉంటారని అంటున్నారు. లేకపోతే వారు నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో ఇబ్బంది పడతారని చెబుతున్నారు.
పిల్లలకు హగ్ ఇస్తే వచ్చే ప్రయోజనాల కోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పది వేల కంటే ఎక్కువ మంది పిల్లలపై అధ్యయనం చేసింది. ఇలా చిన్న పిల్లల నుంచి టీనేజ్ పిల్లల వరకు చేశారు. ఈ అధ్యయనంలో హగ్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలకు ప్రేమ అన్ని ఇస్తారో.. ఆ పిల్లలలో దయ, ఎమోషన్స్, జ్ఞాపకశక్తి కూడా ఎక్కువగా ఉంటాయని తేలింది. అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడిందని అధ్యయనాల్లో తేలింది. అయితే పిల్లలను తిట్టడం, కొట్టడం వంటివి చేయకూడదు. వీటివల్ల పిల్లల్లో సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పిల్లలను తిట్టకుండా, కొట్టకుండా ప్రేమించడం అలవాటు చేసుకోండి. దీనివల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎంతో సంతోషంగా ఉంటారు. లేకపోతే వారిలో కొన్ని లోపాలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.