Phone Cover: ఫోన్ కవర్లో వీటిని పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త
Phone Cover మొబైల్ పౌచ్‌ల వెనుక కార్డులు, డబ్బులు వంటివి పెట్టడం వల్ల కొన్నిసార్లు మొబైల్స్ వేడెక్కి పేలిపోతాయి. కొందరు డ్రైవ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను బైక్‌లో పెడతారు.

Phone Cover: ప్రస్తుతం రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఉదయం లేవడమే మొదలు నిద్రపోయే వరకు మొబైల్ వాడుతున్నారు. అయితే ఈ మొబైల్లోనే అన్నింటిని కూడా ఉంచుతున్నారు. కొందరు డబ్బులు, ఏటీఎం కార్డులు ఇలా అన్ని కూడా ఒక ఫోన్లో పెడతారు. అయితే మొబైల్ సేఫ్టీ కోసం పౌచ్‌లు వాడుతారు. కానీ కొందరు డబ్బులు, ఏటీఎం కార్డుల కోసం వాడుతారు. ఇలా మొబైల్ పౌచ్‌లలో పెట్టడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనివల్ల కలిగే నష్టాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
మొబైల్ పౌచ్‌ల వెనుక కార్డులు, డబ్బులు వంటివి పెట్టడం వల్ల కొన్నిసార్లు మొబైల్స్ వేడెక్కి పేలిపోతాయి. కొందరు డ్రైవ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను బైక్‌లో పెడతారు. ఇలాంటి సమయాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బైక్ వేడి, మొబైల్ వేడి వల్ల పేలిపోతాయి. అయితే మొబైల్ ఎక్కువ సేపు వాడితే.. వేడి ఎక్కుతుంది. అలాగే ఛార్జింగ్ పెట్టినా కూడా మొబైల్ వేడిగా ఉంటుంది. దీనివల్ల కూడా కొన్నిసార్లు పేలిపోతాయి. మొబైల్ వెనుక ఏవైనా ఉంటే బ్యాటరీ ఉబ్బుతాయి. అందులోనూ వేసవి కాలంలో అయితే బయట వేడి, మొబైల్ వేడికి తొందరగా పేలిపోతాయి. ఫోన్ కవర్లో ఏమైనా ఉంటే నెట్వర్క్ కూడా స్లోగానే ఉంటుంది. కొందరికి నెట్ ఇష్యూ ఉంటే ఆ ఏరియాలో ఏమోనని అనుకుంటారు. కానీ మొబైల్ పౌచ్‌లో ఉన్న దానివల్ల అని అర్థం కాదు. వీటివల్ల ఫోన్ బ్యాటరీ తొందరగా వేడెక్కుతుంది. దీంతో మొబైల్ ఫోన్ కూడా తొందరగా పాడవుతుంది. కొందరు మొబైల్ ఛార్జింగ్ పెడుతూ వాడుతుంటారు. ఇలాంటి సమయాల్లో ఫోన్ వెనుక ఏవైనా ఉంటే తొందరగా పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొబైల్ ఫోన్లు అధికంగా వాడకూడదు. వీటిని కాస్త లిమిట్లో వాడటమే మంచిది. మొబైల్ ఎక్కువగా హీట్ అయితే వెంటనే వాడటం మానండి. డైలీ అవసరానికే కొంత సమయం మాత్రమే ఉపయోగించడం మంచిది. ఎక్కువగా మొబైల్ వాడితే కంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. కాబట్టి మొబైల్‌ను రోజులో ఎక్కువ సమయం కాకుండా తక్కువ సమయం మాత్రమే ఉపయోగించండి. ముఖ్యంగా పిల్లలకు అయితే మొబైల్స్ ఇవ్వకూడదు. వీటివల్ల వారికి చిన్నతనం నుంచే సమస్యలు వస్తాయి. ఎక్కువగా దీర్ఘకాలిక సమస్యల బారిన పడతారు. చిన్నతనంలో పిల్లలు ఎక్కువగా మొబైల్స్ చూస్తే.. వారికి మాటలు కూడా తొందరగా రావని అంటున్నారు. ఎంత మారాం చేసినా కూడా పిల్లలకు అసలు మొబైల్స్ ఇవ్వొద్దు. దీనివల్ల వారికి భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.