Solar Eclipse: సూర్యగ్రహణం వేళ… ఈ రాశుల వారికి మహర్దశ..

Solar Eclipse: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు. ఇప్పటికే మార్చి 14న న చంద్రగ్రహణం ఏర్పడింది. ఆ తర్వాత సూర్యగ్రహణం రాబోతుంది. మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఇదే రోజు శనీశ్వరుడు మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కారణంగా పలు రాశులపై ప్రభావం పడింది. అలా ప్రభావం పడే రాశులేవో ఇప్పుడు చూద్దాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 మార్చి 29న మధ్యాహ్నం 2.20 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభం అవుతుంది. తిరిగి 6.16 గంటలకు ముగుస్తుంది. అయితే సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కువగా కనిపించదు. అందువల్ల ఇక్కడ సూతకాలం పనిచేయదు అని కొందరు పండితులు చెబుతున్నారు. కానీ ఈరోజు నుంచి కొన్ని రాశులపై ప్రభావం పడనుంది.
సూర్యగ్రహణం సందర్భంగా మేషరాశిపై ప్రభావం పడనుంది. ఈ రాశి వారికి ఈ రోజు నుంచి ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. మీరు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. కొత్త లక్ష్యాలను పూర్తి చేయడంలో ఉద్యోగులు నిమగ్నమవుతారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారుల కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అయితే పెద్దల సలహా మేరకు ఈ ప్రాజెక్టులను చేపట్టాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు.
మార్చి 29 నుంచి కర్కాటక రాశి వారి జీవితంలో అనుకొని మార్పులు జరగనున్నాయి. మీరు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో పదోన్నతులు పొందుతారు. అదనపు ఆదాయం కోసం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తవుతాయి. అనుకోని అదృష్టం వల్ల ఇంట్లోకి డబ్బు వస్తుంది. పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. విదేశాల్లో కు వెళ్లాలని అనుకునే విద్యార్థులకు అనుకూల ఫలితాలు మారుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణ ఉంటుంది.
సూర్యగ్రహణం సందర్భంగా మకర రాశి వారికి అన్నీ కలిసి రాలు ఉన్నాయి. ఈ రాశి వారు కొత్తగా ఏ పని చేపట్టిన శని దేవుడు ఇలాంటి ఆటంకాలు సృష్టించకుండా ఉంటాడు. అర్హులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఇంట్లో శుభకార్యం నిర్వహిస్తారు. తల్లిదండ్రులకు కావాల్సిన సేవలు చేస్తారు. సోదరుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్యం కలిగితే వెంటనే పరిష్కరించుకుంటారు.
అయితే శని దేవుడు రాశి మారడంతో కొన్ని రాశుల వారికి అనుగ్రహం చూపిస్తున్నాడు. అయితే మిగతా రాజుల వారు శనిదేవుడికి పరిహారం చేయడం వల్ల తమ జీవితాల్లో నష్టాలను తప్పించుకున్న వారవుతారు. అంతేకాకుండా ప్రతి శనివారం నవగ్రహాల పూజ వంటివి చేయడం వల్ల శని దేవుడు శాంతిస్తాడని పండితులు చెబుతున్నారు. ఇలా శాంతించిన వేళ అన్ని శుభాలే జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.