Sri Rama Navami 2025: శ్రీరామ నవమి పూజకు సరైన సమయం ఇదే
Sri Rama Navami 2025 శ్రీరామ నవమి రోజు ఆలస్యంగా కాకుండా బ్రహ్మ ముహుర్తంలోనే నిద్రలేవాలి. తలస్నానం ఆచరించి కొత్త దుస్తులు ధరించి మాత్రమే పూజలు చేయాలి. అయితే నవమి తిథి ఉన్న సమయంలోనే రాముడిని పూజించాలని పండితులు చెబుతున్నారు.

Sri Rama Navami 2025: చైత్రమాసంలో తొమ్మిదవ రోజు నవమి రోజున శ్రీరాముడు పుట్టాడని ఆ రోజున ప్రతీ ఏడాది శ్రీరామ నవమి ఉత్సవాలను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమిని జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము జరిగాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే రాముడి జననం నవమి రోజు కావడంతో ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలో వచ్చే శుక్ల పక్ష నవమి తిథి నాడు శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. శ్రీరామ నవమి పూజను ఎంతో భక్తితో పూజిస్తే ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అయితే శ్రీరామ నవమి రోజు ఆ తిథి ఉన్న సమయంలోనే పూజించాలి. అప్పుడే పూజలకు ప్రతిఫలం అందుతుంది. అయితే శ్రీరామ నవమి జరుపుకోవడానికి సరైన సమయం ఏది? ఏ సమయంలో రాముడిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయో ఈ స్టోరీలో చూద్దాం.
శ్రీరామ నవమి రోజు ఆలస్యంగా కాకుండా బ్రహ్మ ముహుర్తంలోనే నిద్రలేవాలి. తలస్నానం ఆచరించి కొత్త దుస్తులు ధరించి మాత్రమే పూజలు చేయాలి. అయితే నవమి తిథి ఉన్న సమయంలోనే రాముడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఛైత్ర మాసంలో వచ్చే శుక్ల పక్ష నవమి తిథి నాడు శ్రీరామ నవమి పండుగ జరుపుకుంటారు. అయితే ఈ నవమి తిథి ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 7:26 గంటలకు ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి మరుసటి రోజు అనగా ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 7:22 నిమిషాల వరకు ఉంటుంది. ఈ తిథి ఉన్న సమయంలో రాముడికి పూజలు నిర్వహించాలి. అయితే కోరిన కోరికలు నెరవేరాలంటే మాత్రం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.35 నిమిషాల లోగా రాముడిని పూజించాలని పండితులు అంటున్నారు. ఈ సమయంలో రాముడిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని అంటున్నారు.
వీటితో పాటు రామ నవమి రోజు కొన్ని పనులు చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే వస్త్ర దానం, అన్నదానం వంటివి చేయాలని పండితులు అంటున్నారు. వీటితో పాటు డబ్బులు కూడా దానం చేయాలని పండితులు చెబుతున్నారు. వీటిని దానం చేయడం వల్ల ఇంట్లో సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. పేదవారికి అన్నం, వస్త్రాలు దానం చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని పండితులు అంటున్నారు. అలాగే రాముడికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి. వాటి మీద శ్రీరాముని విగ్రహాలు పెట్టి పూజలు చేయాలి. రామ చరిత్ర మానస్ కూడా చదివి.. రాముడిని భక్తితో పూజిస్తే అంతా కూడా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.