Kamindu Mendis: ఐపీఎల్ కోసం హనీమూన్ క్యాన్సిల్.. పాపం ఓడిపోయిన సన్‌రైజర్స్
Kamindu Mendis కమిందు మెండిస్ తన హనీమూన్‌ను క్యా్న్సిల్ చేసుకుని మరి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఆడాడు. కానీ ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓడిపోయింది. కమిందు ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఒక వికెట్ తీశాడు.

Kamindu Mendis: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లోకి ఓ ఆటగాడు ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంక ప్లేయర్ అయిన కమిందు మెండిస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఈ మెగా వేలంలో సన్‌రైజర్స్ జట్టు కమిందును రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ ఐపీఎల్ కోసం కమిందు మెండిస్ తన హనీమూన్‌ను కూడా వాయిదా వేసుకున్నాడట. కావ్య మారన్ జట్టులో తీసుకోవడంతో తన హనీమూన్‌ను క్యాన్సిల్ చేసుకుని మరి వచ్చాడట. అయితే కమిందు రెండు చేతులతో బౌలింగ్ వేస్తాడు. ఇదే ఇతని స్పెషల్. అయితే ఎడమచేతి వాటంగా కమిందు బాగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో కమిందు ఆడటం ఇదే మొదటి సారి. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌తోనే ఈ సీజన్లోకి అడుగుపెట్టాడు.
కమిందు మెండిస్ తన హనీమూన్‌ను క్యా్న్సిల్ చేసుకుని మరి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఆడాడు. కానీ ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓడిపోయింది. కమిందు ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఒక వికెట్ తీశాడు. కేవలం ఒక ఓవర్ మాత్రమే వేసిన కమిందు నాలుగు పరుగులు ఇచ్చి ఒక వికట్ పడగొట్టాడు. అయితే బ్యాటింగ్ లో పెద్దగా రాణించలేదు. మొత్తం 20 బంతుల్లో 27 పరుగులు చేశాడు. హనీమూన్‌ను క్యాన్సిల్ చేసుకుని మరి మ్యాచ్ ఆడినా కూడా హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. అయితే తన చిరకాల స్నేహితురాలు అయిన నిష్నిని కమిందు మెండిస్ ఈ ఏడాది వివాహం చేసుకున్నాడు. గతేడాది నిశ్చితార్థం చేసుకుని ఈ ఏడాది పెళ్లి చేసుకున్నాడు. ఎంతో గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగింది. అయితే వీరు హనీమూన్‌ను కూడా ముందే ప్లాన్ చేసుకున్నారు. శ్రీలంకలో అందమైన ప్రదేశం అయినా హపుటలేలో కమిందు, నిష్ని హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఐపీఎల్ కోసం హైదరాబాద్ జట్టులోకి చేరాల్సి వచ్చింది. దీంతో నెటిజన్లు ఇతన్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే హనీమూన్ కంటే క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని అంటున్నారు. అలాగే అతన్ని అర్థం చేసుకునే భాగస్వామి దొరికిందని, అదృష్టవంతుడని అంటున్నారు. కెరీర్ కోసం హనీమూన్‌ను పక్కన పెట్టాడని గ్రేట్ అని అంటున్నారు.
Kamindu Mendis bowling with both hands in an over and got a wicket too.#KKRvsSRH | #SRHvsKKR | #SRHvKKRpic.twitter.com/NQOcXdiF9T
— Don Cricket 🏏 (@doncricket_) April 3, 2025