KKR Vs SRH: సన్‌రైజర్స్‌తో కేకేఆర్ కీలక మ్యాచ్.. గెలిచేదెవరు?
KKR Vs SRH సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి బ్యాట్ ఇస్తే చాలు.. బాదుడే బాదుడు. ప్రతీ మ్యాచ్‌లో కూడా 300 తప్పకుండా రావాలని భావిస్తోంది. ఈ క్రమంలో మొదటి మ్యాచ్ మాత్రమే 300 దగ్గరు వరకు స్కో్ర్ చేసింది.

KKR Vs SRH: ఐపీఎల్ ఛాంపియన్స్ ట్రోఫీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో మొదటి మ్యాచ్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే మైదానంలో మ్యాచ్‌కి సిద్ధమవుతోంది. నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా తలపడనుంది. అయితే ఫ్యాన్స్ అందరి దృష్టి కూడా ఈ మ్యాచ్‌పైనే. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 300 కొడుతుందా? అలాగే పిచ్ ఎలా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే పిచ్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మరి మ్యాచ్‌లో ఎవరెవరు ఎలాంటి అద్భుతాలు చేస్తారో చూడాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి బ్యాట్ ఇస్తే చాలు.. బాదుడే బాదుడు. ప్రతీ మ్యాచ్‌లో కూడా 300 తప్పకుండా రావాలని భావిస్తోంది. ఈ క్రమంలో మొదటి మ్యాచ్ మాత్రమే 300 దగ్గరు వరకు స్కో్ర్ చేసింది. ఆ తర్వాత మ్యాచ్‌లు కనీసం 200 కంటే ఎక్కువ స్కోర్ కూడా దాటలేదు. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు దూకుడుగా ఆడితేనే పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంటుంది. లేకపోతే ఈ సీజన్లో సెమీ ఫైనల్స్ వరకు వెళ్లడం కూడా కష్టమే. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎక్కువ పరుగులు తీసే కుర్రాళ్లు కూడా ఉన్నారు. తెలుగు కుర్రాడు అయిన నితీశ్‌కుమార్ రెడ్డి అయితే పరుగుల బీభత్సంగా చేస్తాడు. కానీ ఇంకా ఎక్కువ పరుగులు అయితే చేయలేదు. మంచి ఇన్నింగ్స్ చేయడానికి అవకాశం చూస్తున్నాడు. ఇక అభిషేక్, ట్రావిస్ హెడ్ కూడా పరుగులు చేయలేదు. దీనివల్ల లాస్ట్ రెండు మ్యాచ్‌లలో స్కోర్ తగ్గిపోయింది. మరి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 300 స్కోర్ చేస్తుందో లేదో చూడాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ సత్తా చాటుతోంది. ఎలాంటి పిచ్‌పైనా అయినా సరే.. స్కోర్ బాదుతుంది. అలాగే బౌలింగ్ కూడా చేస్తోంది. ఇందులో మహ్మద్ షమీ, యువ స్పిన్నర్ జీషన్ అన్సారి అద్భుతంగా బౌలింగ్ వేస్తారు. వీరివల్ల పరుగులు తీయకపోయినా కూడా బౌలింగ్‌తో కట్టడి చేస్తుంది. కోల్‌కతా జట్టు ఐపీఎల్లో మొదటి మ్యాచ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ అజింక్య రహానె క్యూరేటర్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశాడు. దీనికి క్యూరేటర్ కూడా అలానే స్పందించాడు. అయితే ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే బ్యాటింగ్‌కు కూడా పెద్ద కష్టం కాదని అంటున్నారు.