Retired Out Vs Retired Hurt: రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ మధ్య తేడా ఏంటి?
Retired Out Vs Retired Hurt క్రికెట్ లాంగ్వెజ్‌లో రిటైర్డ్ ఔట్ అంటే.. క్రీజులో ఉన్న బ్యాటర్ ఎప్పుడైనా ఔట్ కాకుండా మైదానం నుంచి వెళ్లిపోవచ్చు. ఇలా వెళ్లిన ప్లేయర్‌ను ఔట్‌గా భావిస్తారు.

Retired Out Vs Retired Hurt: ఐపీఎల్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఇన్నింగ్స్ మధ్యలోనే రిటైర్డ్ ఔట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో రిటైర్డ్ ఔట్ అంటే ఏంటని బాగా వైరల్ అవుతోంది. చాలా మంది రిటైర్డ్ ఔట్ అంటే ఏంటని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. తిలక్ వర్మను రిటైర్డ్ ఔట్ చేసి ఇతని ప్లేస్‌లో శాంటర్న్ను తీసుకున్నారు. అయితే దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. మ్యాచ్ మధ్యలో ఇలా రిటైర్డ్ ఔట్ తిలక్ వర్మను చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని పలువురు పేర్కొన్నారు. అయితే క్రికెట్లో ఇలా చాలా పదాలు ఉంటాయి. అసలు రిటైర్డ్ ఔట్ అంటే ఏంటి? అలాగే రిటైర్డ్ హర్ట్ అంటే ఏంటి? అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.
రిటైర్డ్ ఔట్
క్రికెట్ లాంగ్వెజ్‌లో రిటైర్డ్ ఔట్ అంటే.. క్రీజులో ఉన్న బ్యాటర్ ఎప్పుడైనా ఔట్ కాకుండా మైదానం నుంచి వెళ్లిపోవచ్చు. ఇలా వెళ్లిన ప్లేయర్‌ను ఔట్‌గా భావిస్తారు. మళ్లీ తిరిగి మైదానంలోకి వచ్చి ఆడరు. మళ్లీ క్రీజులోకి వచ్చే ఛాన్స్ అసలు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాటర్ ఔట్ కాకుండా తన వికెట్‌ను త్యాగం చేయాలి. అయితే బ్యాటర్ ఆ సమయంలో సరిగ్గా ఆడకపోతే ఇలా చేస్తారు. ఇదంతా కూడా జట్టులో భాగమే. తిలక్ వర్మ కూడా మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడానికి తడబడ్డాడు. దీంతో రిటైర్డ్ ఔట్ చేశారు.
రిటైర్డ్ హర్ట్
రిటైర్డ్ హర్ట్ అంటే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బ్యాటర్ అనారోగ్యం కారణంగా మ్యాచ్ మధ్యలో వెళ్లిపోతే దాన్ని రిటైర్డ్ హర్ట్ అంటారు. అయితే ఇలా వెళ్లిన ఆటగాడు మళ్లీ తిరిగి ఫీల్డ్‌లోకి చేరవచ్చు. అంపైర్ అనుమతి తీసుకుని ఆడవచ్చు. ఇలా మైదానం వీడిన ఆటగాడిని అసలు ఔట్‌గా పరిగణించారు. అనారోగ్య బారిన పడితే మళ్లీ ట్రీట్మెంట్ తీసుకొని క్రీజులోకి రావచ్చు. ఇలా వచ్చిన తర్వాత వ్యక్తిగత స్కోర్ కూడా కంటిన్యూ చేస్తారు.
ముంబై, లక్నో మ్యాచ్‌లో తిలక్ వర్మ మధ్యలో రిటైర్డ్ ఔట్ కావడంతో వీటి గురించి చర్చ మొదలైంది. లక్నోపై ముంబై విజయం సాధించాలంటే 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో హార్దిక్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో తిలక్ వర్మ టైమింగ్‌ను కాస్త తడబడుతూ.. 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ అతన్ని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. మ్యాచ్ బట్టి జట్టు నిర్ణయం తీసుకుంటుంది. మ్యాచ్‌లో కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. కెప్టెన్, టీం అంతా కూడా నిర్ణయించుకుని ఈ డెసిషన్‌కు వస్తారు. అయితే తర్వాత మ్యాచ్‌కి వచ్చే బ్యాటర్ ఎక్కువ పరుగులు చేసే వారైతే పెద్దగా విమర్శలు రావు. కానీ రిటైర్డ్ ఔట్ అయిన ప్లేయర్‌లానే ఉంటే.. తప్పకుండా విమర్శలు వస్తాయి. తిలక్ వర్మ విషయంలోనూ కూడా ఇలానే జరిగింది.