Paloma Cipriano: ఈ యూట్యూబర్ జర్నీ అంత సులభం కాదు. కానీ ఇప్పుడు లక్షల సంపాదన.
Paloma Cipriano: యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ఇక ఇందులో వ్యూయర్స్ కంటే కంటెంట్ సృష్టికర్తలు కూడా ఎక్కువ మందే ఉంటున్నారు.

<h3>Paloma Cipriano: </h3>యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ఇక ఇందులో వ్యూయర్స్ కంటే కంటెంట్ సృష్టికర్తలు కూడా ఎక్కువ మందే ఉంటున్నారు. చాలా మంది ఈ ఫ్లాట్ ఫామ్ ల ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు. అయితే కొందరికి ఇది సులభం అయితే మరికొందరికి మాత్రం చాలా కష్టమైన పని అనడంలో సందేహం లేదు. సంవత్సరాల తరబడి వీడియోలు పోస్ట్ చేసినా సరే అసలు వ్యూస్ రాకపోవచ్చు. ఢీలా పడి కొందరు చానల్స్ ను ఆపేస్తుంటారు కూడా.
కొందరికి వచ్చే నెగటివ్ కామెంట్ల వల్ల చాలా మరింత డీలా పడుతున్నారు. ఛానల్స్ ను రన్ చేయకుండా మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో వైరల్ అవడం పెద్ద సమస్య అయితే వైరల్ అయిన తర్వాత నిలబడటం మరో పెద్ద సమస్యగా మారుతుంది. అయితే ఓ యూట్యూబర్ అనుకోకుండా ఛానెల్ పెట్టి ఇప్పుడు మంచి ఫేమ్ తో డబ్బులు కూడా బాగానే సంపాదిస్తుంది. మరి ఆమె జర్నీ ఏంటో తెలుసుకుందామా?
ప్రస్తుతం చాలా మంది తమ ప్రతిభను సోషల్ మీడియా ద్వారా ప్రదర్శిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లలో సొంతంగా కంటెంట్ ను సృష్టించి లక్షలు సంపాదిస్తున్నారు. చాలా మంది యూట్యూబర్లుగా సక్సెస్ ను కూడా సాధిస్తున్నారు. ఇక మహిళా యూట్యూబర్లు అందం, హోం, ఫ్యాషన్, ట్రావెలింగ్, డైలీ వ్లాగ్ వంటివి చేస్తుంటారు. కానీ బ్రెజిల్ కు చెందిన పాలోమా సిప్రియానో కాస్త డిఫరెంట్ గా ఆలోచించి మంచి యూట్యూబర్ గా ఎదిగింది. ఈమె ఛానెల్ ను ఓపెన్ చేస్తే భవన నిర్మాణానికి సంబంధించిన అనేక వీడియోలు మనకు కనిపిస్తాయి.
తన ఇంటిని రెన్నోవేట్ చేయాలి అనుకుంటున్న పాలోమా ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల వల్ల వారే రెన్నోవేట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఈమెకు నిర్మాణ రంగం మీద మంచి ఆసక్తి వచ్చింది. దానికి సంబంధించిన చిట్కాలు అందరికీ చెబుతూ యూబ్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది. కానీ మొదట్లో ఈమె చేస్తున్న పనికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ రంగంలో పని చేస్తున్న పురుషులు నెగటివ్ గా కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. అవన్నీ తట్టుకొని నిలబడి ఈ రోజు మంచి యూట్యూబర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈమెకు 19 లక్షల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.