Iqoo New Phone: మార్కెట్లోకి ఐక్యూ కొత్త ఫోన్.. తక్కువ ధరకే బెస్ట్ ఫోన్
Iqoo New Phone ఐక్యూ జెడ్10 మొబైల్ రెండు రకాల స్టోరేజ్‌లో లభ్యమవుతుంది. 128 జీబీ, 256 జీబీలో లభిస్తుంది. అయితే దీని ప్రారంభ ధర దేశంలో రూ.21,999 ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Iqoo New Phone: మార్కెట్లోకి ఎన్నో కొత్త కొత్త ఫోన్లు వస్తుంటాయి. మంచి ఫీచర్లతో ఏ కొత్త మొబైల్ వచ్చినా కూడా కొందరు కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే మార్కెట్లోకి ఐక్యూ నుంచి సరికొత్త మోడల్ మొబైల్ వస్తోంది. ఐక్యూ ఫీచర్లలో ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పవచ్చు. ఐక్యూ జెడ్10గా వచ్చే ఈ మొబైల్లో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌తో ఉంటుంది. అయితే వీటిలో కొన్ని ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. మార్కెట్లో ఇది చాలా మందికి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కావచ్చు. కానీ వీటిలోని ఫీచర్లు తప్పకుండా అందరికీ కూడా నచ్చుతాయి. ఈ మొబైల్ మార్కెట్లోకి ఏప్రిల్ 11వ తేదీన రానుంది. అయితే ఈ మొబైల్ ధర ఎంత ఉంటుంది? దీని ఫీచర్లు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐక్యూ జెడ్10 మొబైల్ రెండు రకాల స్టోరేజ్‌లో లభ్యమవుతుంది. 128 జీబీ, 256 జీబీలో లభిస్తుంది. అయితే దీని ప్రారంభ ధర దేశంలో రూ.21,999 ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది గత జనరేషన్ కంటే కాస్త ఎక్కువ స్మార్ట్‌గా ఉంటుందట. ఈ మొబైల్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే.. డిస్కౌంట్లో తక్కువకి వస్తుంది. రూ.2000 బ్యాంకు డిస్కౌంట్‌తో మీకు కేవలం రూ.19,999కు లభిస్తుంది. ఐక్యూ జెడ్ 10 రెండు కలర్లో వస్తుంది. గ్లేసియర్ సిల్వర్, స్టెల్లార్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లో ఉన్నాయి. ఈ మొబైల్స్ అమెజాన్ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లో లభిస్తుంది. అయితే ఈ ఐక్యూ జెడ్10 స్మార్ట్‌ఫోన్‌లో 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ ఉంది. బ్యాటరీ పవర్ 7,300 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుంది. మీరు ఈ మొబైల్‌ను ఛార్జింగ్ పెడితే కేవలం 33 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ ఎక్కుతుంది. స్పీడ్‌గానే ఛార్జింగ్ ఎక్కుతుంది.
ఈ ఐక్యూ జెడ్10 మొబైల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 ప్రైమరీ కెమెరా ఉండటంతో పాటు 2 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ మొబైల్ ఏప్రిల్ 11వ తేదీన లాంఛ్ అవుతుంది. పూర్తి ఫీచర్లు కరెక్ట్‌గా తెలియాలంటే లాంఛ్ అయ్యే వరకు ఆగాల్సిందే.