World Water Day: జల దినోత్సవం: ఏ దేశాల్లో స్వచ్ఛమైన నీరు ఉంది? ఇండియా ర్యాంక్ ఎంత?
World Water Day: ప్రతి ఒక్కరికీ నీరు కావాల్సిందే. నీరు లేకుండా జీవించడం కుదరదు. జంతువులు, మానవులు, పక్షులు అన్నింటికి కూడా నీరు కావాల్సిందే.

World Water Day: ప్రతి ఒక్కరికీ నీరు కావాల్సిందే. నీరు లేకుండా జీవించడం కుదరదు. జంతువులు, మానవులు, పక్షులు అన్నింటికి కూడా నీరు కావాల్సిందే. ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన త్రాగునీరు పొందే హక్కు, అవసరం ఉంది. మనిషి కొన్ని రోజులు ఆహారం లేకుండా జీవించగలడు. కానీ నీరు లేకుండా మాత్రం అసలు జీవించలేరు. శరీరం మొత్త డీహైడ్రేట్ అవుతుంది. అయితూ గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న కాలుష్యం కారణంగా, స్వచ్ఛమైన తాగునీరు రోజురోజుకూ తగ్గిపోతోంది. కానీ కొన్ని దేశాలు ఉన్నాయండీ.. అక్కడ పరిశుభ్రమైన నీటిని పొందడానికి ఎటువంటి ప్రయత్నం అవసరమే లేదు. సులభంగా శుభ్రమైన నీరు లభిస్తుంది. అయినా ఈ నీరు గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఈ రోజు ప్రపంచ జల దినోత్సవం. అందుకే పరిశుభ్రమైన నీరు సులభంగా లభించే దేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి మన దేశం ఏ ర్యాంకులో ఉందో తెలుసా?
పెరుగుతున్న స్వచ్ఛమైన నీటి కొరత కారణంగా ప్రతి సంవత్సరం మార్చి 22న జల సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నిజానికి, ప్రపంచంలో రెండు బిలియన్లకు పైగా ప్రజలు సురక్షితమైన తాగునీరు లేకుండా జీవిస్తున్నారు. ఆ నివేదిక ప్రకారం, అపరిశుభ్రమైన నీటి వల్ల కలిగే విరేచనాల కారణంగా ప్రతి రెండు నిమిషాలకు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఒక పిల్లవాడు మరణిస్తున్నాడు. అందుకే ఈ ప్రత్యేక రోజున, నీటి సంరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 2025 ప్రపంచ జల దినోత్సవం థీమ్ హిమానీనదాల సంరక్షణ. హిమానీనదాలు జీవితానికి చాలా ముఖ్యమైనవి. ప్రపంచంలోని మంచినీటిలో ఎక్కువ భాగాన్ని నిల్వ చేస్తాయి.
ఏ దేశాల్లో అత్యంత పరిశుభ్రమైన నీరు ఉంది?
స్వచ్ఛమైన తాగునీటి గురించి మాట్లాడుకుంటే, ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ పేర్లు ఈ జాబితాలోకి వస్తాయి. ఈ దేశాలలో చాలా శుభ్రమైన తాగునీరు ఉంది. భారతదేశం గురించి మాట్లాడుకుంటే, మన దేశం ఈ జాబితాలో 139వ స్థానంలో ఉంది. నీటి వినియోగం పరంగా భారతదేశం 10వ స్థానంలో ఉంది. పరిశుభ్రమైన నీటి జాబితాలో, పాకిస్తాన్ భారతదేశం కంటే వెనుకబడింది. పాకిస్తాన్ పేరు 144వ స్థానంలో ఉంది. మన దేశంలో కూడా పరిశుభ్రమైన నీరు పెద్ద సమస్యగా మారింది. మురికి నీటిని వాడటం వల్ల ఇక్కడి ప్రజలు సాధారణంగా కడుపునొప్పి, విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు.
చైనా సంఖ్య ఎంత?
స్వచ్ఛమైన నీటి విషయంలో, భారతదేశ పొరుగు దేశమైన చైనా 54వ స్థానంలో ఉంది. మీ ఆరోగ్యానికి, అలాగే పొడవైన, మందపాటి జుట్టు, మెరిసే చర్మం, మంచి ఆరోగ్యానికి పరిశుభ్రమైన నీరు చాలా ముఖ్యం. పరిశుభ్రమైన నీరు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దాని మంచి ప్రభావాలు భవిష్యత్తులో కనిపిస్తాయి.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.