Duvvada Srinivas Madhuri Dance: రెచ్చిపోయిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట.. ఈ వీడియో చూడాల్సిందే
Duvvada Srinivas Madhuri Dance దివ్వెల మాధురి( Madhuri) పెద్ద కుమార్తె ఆఫ్ శారీ ఫంక్షన్ లో కనువిందు చేసింది ఈ జంట. హైదరాబాదులోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ ఫంక్షన్ లో భారీ స్టేజ్ పై స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

Duvvada Srinivas Madhuri Dance: తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలు గా పేరు పొందారు దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ), దివ్వెల మాధురి. తెలుగు రాష్ట్రాల్లో ఈ జంట పేరు తెలియని వారు ఉండరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటూ మాధురితో సన్నిహితంగా ఉంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తో జరిగిన రచ్చ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అటు తరువాత ఆ వివాదం సద్దుమణిగింది. కానీ శ్రీనివాస్, మాధురి జంట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ జంట హైదరాబాదులోని ఓ ఫంక్షన్ లో అదిరేటి స్టెప్పులు వేస్తూ అలరించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
* పాత పాటకు స్టెప్పులే స్టెప్పులు..
దివ్వెల మాధురి( Madhuri) పెద్ద కుమార్తె ఆఫ్ శారీ ఫంక్షన్ లో కనువిందు చేసింది ఈ జంట. హైదరాబాదులోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ ఫంక్షన్ లో భారీ స్టేజ్ పై స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కలర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో, భారీ డెకరేషన్తో ఏర్పాటు చేసిన స్టేజి మీద ఖరీదైన కాస్ట్యూమ్స్ తో అదరగొట్టారు. తమకు సూటయ్యే సూట్ తో.. స్టెప్పులు వేశారు. ఆ వీడియోను మాధురి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. ఇక ఆ సాంగ్ కూడా వారిద్దరి ప్రేమ కథకు తగ్గట్టుగానే ఉండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందీలో ఉన్న ఆ పాట ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే హై హర్ జబాన్ పర్ అంటూ ఆ పాత మధుర పాటకు తమదైన శైలిలో డాన్స్ వేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్ అయింది ఈ జంట. మీడియా ఛానళ్లు సైతం ప్రత్యేకంగా పిలిచి మరి ఇంటర్వ్యూలు తీసుకున్నాయంటే ఈ జంట ఎంత హల్చల్ చేస్తుందో తెలియంది కాదు.
* వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టి..
శ్రీకాకుళం జిల్లాకు( Srikakulam district) చెందిన దువ్వాడ శ్రీనివాస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండేవారు. ఇటీవలే ఆయన పై వైసిపి నాయకత్వం వేటు వేసింది. వకుల సిల్క్స్ పేరుతో ఈ జంట హైదరాబాదులో వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది. ఇప్పుడు మాధురి పెద్ద కుమార్తె ఆఫ్ శారీ ఫంక్షన్ కూడా అక్కడే చేయడం విశేషం.