Amaravati Re Launch: అమరావతి 2.0.. అమరావతి 2.0.. పవన్ కు ప్రధాని మోదీ అదిరిపోయే గిఫ్ట్! !
Amaravati Re Launch పవన్ కళ్యాణ్ తో ప్రధాని నరేంద్ర మోడీకి( Prime Minister Narendra Modi) ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. ఏపీలో సీఎం చంద్రబాబు తో పాటు మంత్రుల ప్రమాణ స్వీకార వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు.

Amaravati Re Launch: అమరావతి( Amravati ) పునర్నిర్మాణ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. వెలగపూడి లో జరిగిన అమరావతి సభలో మోదీ పాల్గొన్నారు. అయితే ఈ ప్రారంభోత్సవ ఘట్టంలో ఆసక్తికర పరిణామాలు వెలుగు చూశాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశ్చర్యకర బహుమానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తిచేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో.. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను పిలిచారు. పవన్ కళ్యాణ్ చేతిలో బహుమతి పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
* మంచి సంబంధాలు..
పవన్ కళ్యాణ్ తో ప్రధాని నరేంద్ర మోడీకి( Prime Minister Narendra Modi) ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. ఏపీలో సీఎం చంద్రబాబు తో పాటు మంత్రుల ప్రమాణ స్వీకార వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. నాడు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ను అభినందించారు. అంతటితో ఆగకుండా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. మెగా బ్రదర్స్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో సైతం పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ఫిదా అయ్యారు. భారీ జన సందోహం నడుమ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం అట్టహాసంగా సాగుతోంది. ముందుగా మంత్రులు నారాయణ, నారా లోకేష్ ప్రసంగించారు. అనంతరం పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. గత ఐదేళ్లలో అమరావతి రైతుల పోరాటం, వారు ఎదుర్కొన్న బాధలను వివరించే ప్రయత్నం చేశారు. అమరావతి రాజధానికి ప్రధాని నరేంద్ర మోడీ అండగా నిలుస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.
* ప్రత్యేకంగా పిలిచి మరీ..
పవన్ తన ప్రసంగాన్ని ముగించాక తన సీట్లో కూర్చున్నారు. అయితే ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ప్రత్యేకంగా పిలిచారు. ప్రధాని వద్దకు వెళ్లిన పవన్ చేతిలో చాక్లెట్ పెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్, పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ముఖాల్లో నవ్వులు విరిసాయి. జనసేన సోషల్ మీడియా విపరీతంగా ఈ వీడియోను వైరల్ చేస్తోంది.