Deeksha Seth: సినిమాలు మానేసి ఐటీ జాబ్ చేస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

Deeksha Seth:
చాలామంది ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి స్టార్ డం సంపాదించుకున్నారు.
కొంతమంది ముద్దుగుమ్మలు ఒకటి లేదా రెండు సినిమాలలో మాత్రమే కనిపించి సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ వీళ్ళు ప్రేక్షకుల మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇలాంటి వారిలో వేదం సినిమా హీరోయిన్ కూడా ఒకరు అని చెప్పొచ్చు. క్రిష్ దర్శకత్వం వహించిన వేదం సినిమా 2010లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ఇండస్ట్రీ లోకి చాలామంది హీరోయిన్స్ గా రాణించడానికి ఎన్నో కలలతో వస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లకు పది సినిమాలు చేసినా కూడా దక్కని క్రేజ్ మరి కొంతమందికి మాత్రం కేవలం ఒక సినిమాతోనే వచ్చేస్తుంది. ఇక సినిమాలలో కెరియర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రలలో నటించిన వాళ్లు ఆ తర్వాత హీరోయిన్ గా స్టార్ డం కూడా సంపాదించుకున్నారు. కానీ అదే క్రేజ్ ను ఎప్పటికీ మెయింటెన్ చేయలేరు. ఒకటి లేదా రెండు సినిమాలలో మాత్రమే కనిపించి ఇండస్ట్రీకి దూరమైన ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. వాళ్లు స్టార్ హీరోల సినిమాలలో నటించిన కూడా ఆ తర్వాత అవకాశాలు రాక సైలెంట్ గా ఉండిపోయారు. తమ అందం, అభినయంతో మొదటి సినిమాతోనే బాగా ఫేమస్ అయ్యి ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్లలో హీరోయిన్ దీక్షా సేథ్ కూడా ఒకరు. అయితే ఈ పేరు చెప్తే ప్రేక్షకులు గుర్తుపట్ట లేకపోవచ్చు కానీ మీరు ప్రభాస్ నటించిన రెబల్ సినిమాలో ప్రభాస్ ప్రేమించిన అమ్మాయి లేదా వేదం సినిమాలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్ అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు.
వేదం సినిమా తర్వాత దీక్ష కు తెలుగులో అవకాశాలు వచ్చాయి. హీరో గోపీచంద్ కు జోడిగా ఈ అమ్మడు వాంటెడ్ సినిమాలో నటించింది. అలాగే మాస్ మహారాజ్ రవితేజకు జోడిగా నిప్పు, మిరపకాయ సినిమాలలో కూడా నటించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడిగా రెబల్ సినిమాలో కూడా నటించి దీక్షకులను అలరించింది. అయితే ఈ సినిమాలతో దీక్ష టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఈమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత అందరూ ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు క్యూ కడతాయి అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఈమెకు అవకాశాలు అయితే రాలేదు.
చివరగా దీక్ష తెలుగులో 2012లో రిలీజ్ అయిన ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు వెళ్ళింది. హిందీలో దీక్ష లేకర్ హమ్ దివానా దిల్, ది హౌస్ ఆఫ్ ది డెడ్ 2 సినిమాలలో నటించింది. కానీ అక్కడ కూడా ఈమెకు అదృష్టం కలిసి రాలేదు అని తెలుస్తుంది. దాంతో ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఈమె తెలుగు,హిందీ తో పాటు కన్నడలో దర్శన్ కు జోడిగా జగ్గు భాయ్ సినిమాలో నటించి అలరించింది. ప్రస్తుతం ఈమెకు సినిమా అవకాశాలు రాకపోవడంతో లండన్ వెళ్లిపోయింది. లండన్ లో దీక్ష ఐటి జాబ్ చేస్తున్నట్లుగా సమాచారం.