Sandeep Reddy Vanga: ఈ డైరెక్టర్‌కి ఇంత డిమాండ్ హా.. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే?

Sandeep Reddy Vanga:
సాధారణంగా హీరో కోసం డైరెక్టర్లు వెయిట్ చేస్తుంటారు. స్టోరీ చెప్పిన తర్వాత వారికి సమయం కుదరకపోతే.. కొన్ని రోజులు వెయిట్ చేస్తారు. కానీ ఓ స్టార్ డైరెక్టర్ కోసం హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఆ డైరెక్టర్‌తో కలిసి పనిచేయాలని ఎందరో హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఆఖరికి ఛాన్స్ ఎందుకు ఇవ్వడం లేదని ఏకంగా ఆ డైరెక్టర్ దగ్గరకే వెళ్లి అడిగాడు ఓ హీరో. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సందీప్ వంగా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఇతనితో సినిమా తీయాలని చాలా మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు. సందీప్ వంగా తీసిన సినిమాలు వరుస హిట్‌లు సాధించడంతో అందరి హీరోల చూపు సందీప్ వంగాపైనే ఉంది. అయితే సందీప్ వంగాతో సినిమా తీయాలని ఓ హీరో ఏకంగా దరఖాస్తు చేసుకున్నాడు. అతను ఎవరో కాదు.. మంచు విష్ణు. సందీప్ వంగా సినిమాలో ఒక్క ఛాన్స్ కోసం ఏకంగా మంచు విష్ణు దరఖాస్తు చేసుకున్నాడు. ఆదిత్య ఓం అయితే ఏకంగా ఎలాంటి పాత్రకు అయినా కూడా స్పిరిట్ సినిమాలో సరిపోతానని అన్నాడు. అయితే ఈ సినిమాలో అవకాశం తనకే ఇవ్వాలంటూ.. డిమాండ్ చేస్తున్నారు. సందీప్ వంగా సినిమాలో నటించే అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సందీప్ వంగా క్రేజ్ అంతా ఇంతా కాదు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు హిట్ కావడంతో రేంజ్ పెరిగిపోయింది.
ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగా మూడు సినిమాలు తీశాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వచ్చాయి. ఇవన్నీ హిట్ కావడంతో సందీప్ రెడ్డి వంగా రేంజ్ మారిపోయింది. ఈ మూడు చిత్రాలు కూడా హిట్ కావడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇవి దీంతో సందీప్ రెడ్డి వంగాకి భారీగానే ఆఫర్లు వచ్చాయి. ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ కూడా తీస్తున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సందీప్ వంగా లైఫ్ మారిపోయింది. ఈ సినిమా వల్ల కేవలం సందీప్ వంగాకి మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండకి కూడా బాగా పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతో అతని స్టార్ డమ్ ఒక్కసారిగా మారిపోయింది. స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా అతనికి సెకండ్ లైఫ్‌ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమాను రీమేక్‌గా బాలీవుడ్‌లో కబీర్ సింగ్ మూవీ తీశారు. ఇది కూడా మంచి హిట్ సాధించడంతో సందీప్ వంగాకి భారీ ఆఫర్లు వచ్చాయి.