Romania : అక్కడ శ్మశానవాటికలు పర్యాటక ప్రదేశాలు.. ఆత్మలతో సావాసమా?

Romania :
శ్మశానవాటిక.. అమ్మో ఈ పేరు వింటేనే పెద్ద భయం కదా. ఆ వైపు వెళ్లాలి అంటే వణుకు వస్తుంటుంది. దాని గురించి ఎవరైనా టాపిక్ తీస్తే యే వేరే టాపిక్ మాట్లాడు ఈ అర్ధరాత్రి సమయంలో ఆ టాపిక్ ఎందుకు అని భయపడతారు. ఇక స్మశానవాటికల పేర్లు కూడా తీయరు. ఆ వైపు పోవాలంటే ఫుల్ గా భయం వేస్తుంటుంది. మన పెద్దల నుంచి కూడా వీటి కథలు వింటూనే ఉన్నాము. ఈ ప్రాంతం వెళ్లదగ్గ ప్రాంతం కాదు కదా. ఏదైనా ప్రాంతానికి వెళ్లి ఆ వైపు నుంచి ఇంటికి వచ్చినా సరే తిడుతుంటారు పెద్దవాళ్లు.
సాధారణంగా ప్రజలు తమలో ఒకరు చనిపోయి ఖననం చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తారు. కానీ ప్రపంచంలో ఒక దేశంలో స్మశానవాటికలు పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయని మీకు తెలుసా? ఆ ప్రాంతాలను సందర్శించడానికి చాలా దూరం నుంచి ప్రజలు వస్తారు. కాస్త వింతగా అనిపిస్తుందా? అయితే చదివేసేయండి.
ఈ రకమైన వింత స్మశానవాటిక రొమేనియాలో ఉంది. దీనిని ప్రజలు స్మశానవాటిక అంటారు. ఈ స్మశానవాటికల గురించి వేర్వేరు కథలు చెబుతుంటారు. అయితే ఈ స్మశానవాటికలలో రంగురంగుల రాళ్ళు ఉన్నాయి. ఆ వ్యక్తి జీవితం గురించి కథలు రంగురంగుల రాళ్లతో సమాధులపై రాస్తారు. దానిపై చిత్రాలు కూడా తయారు చేశారు. ఈ స్మశానవాటిక రొమేనియాలోని మారా మరోష్ గ్రామంలో ఉంది. ఈ స్మశానవాటికలో మీరు మరణించిన వ్యక్తి గురించి ప్రతిదీ తెలుసుకోవచ్చు. అతను ఏ పని చేసాడు, ఎలా చనిపోయాడు వంటి పూర్తి వివరాలు తెలుసుకొని ఆయన జీవితం గురించి చదవవచ్చు.
ఇక ఈ స్మశానవాటిక తర్వాత బెల్లు స్మశానవాటికకు కూడా చాలా మంది వెళ్తారు. ఇది రొమేనియా పర్యాటక స్మశానవాటికలలో కూడా అగ్రస్థానంలో ఉంది. పాత నగరం కాకుండా వేరే ఏదైనా చూడాలనుకునే వారికి ఇది ఒక ఆకర్షణ కేంద్రం. దీనిని ఆత్మల తోట అంటారు. ఇక్కడ ఉన్న యూదుల స్మశానవాటిక కూడా చదవవచ్చు. ఈ దేశంలోని పురాతన స్మశానవాటికలలో ఒకటి. 1941 ఊచకోత బాధితులను ఇక్కడ ఖననం చేశారు. తదుపరిది ఎవాంజెలికల్ స్మశానవాటిక. మీరు దీన్ని ఏ పర్యాటక మార్గదర్శి పుస్తకంలోనూ కనుగొనలేరు. మీరు ఇక్కడికి వెళితే, ఈ ప్రదేశాన్ని సందర్శించడం మర్చిపోవద్దు. కొండ పైన ఉన్న 14వ శతాబ్దపు కోట శిథిలాల చుట్టూ లూథరన్ స్మశానవాటిక ఉంది. ఇక్కడికి వెళితే, కాలంలో వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.