World Map : త్వరలో మారనున్న ప్రపంచ పటం…. కారణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

World Map :
ప్రపంచ స్థాయిలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సహజ దృగ్విషయాలు వేగంగా మారుతున్నాయి. దీంతో మొత్తం ప్రపంచ పటాన్ని వేగంగా మార్చే అవకాశాలు పెరుగుతున్నాయి. అంటే భవిష్యత్తులో ప్రపంచ భౌగోళికం లో ప్రత్యేక మార్పులు ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది ప్రపంచ పటానికి కొత్త ఆకృతిని ఇవ్వగలదు , కానీ అలాంటి మార్పులు ఎందుకు జరగవచ్చు ? అనే వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్రపంచంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు . అందుకే ప్రపంచ పటంలో మార్పులు ఉండవచ్చట. మరి దీని వెనుక కారణాలు ఏంటంటే?
వాతావరణ మార్పు, సముద్ర మట్టం పెరుగుదల
ప్రపంచ పటాన్ని మార్చడంలో వాతావరణ మార్పు కీలక పాత్ర పోషించగల ప్రధాన అంశం . ప్రపంచంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, హిమానీనదాలు కరగడం, సముద్ర మట్టాలు పెరిగి తీరప్రాంతాలను ప్రభావితం చేస్తున్నాయి . మాల్దీవులు, పాపువా న్యూ గినియా వంటి చిన్న ద్వీప దేశాలకు, సముద్ర మట్టం పెరుగుదల తీవ్రమైన ముప్పుగా మారుతుంది. అంటే ఈ దేశాల భూమి ఉనికికే ముప్పు కలగనుంది . సో అవి కొన్ని రోజుల తర్వాత ప్రపంచ పటంలో కనిపించకపోవచ్చు కూడా.
ప్రపంచ పటాన్ని మార్చడంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సంఘర్షణలు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి . దేశాల మధ్య సరిహద్దు వివాదాలు పెరిగి , సార్వభౌమాధికారం కోసం పోరాటాలు తీవ్రమవుతున్న కొద్దీ , కొత్త సరిహద్దులు , దేశాలు ఏర్పడవచ్చు . ఉదాహరణకు , కాశ్మీర్ , ఉక్రెయిన్ వంటి ప్రాంతాలలో కొనసాగుతున్న ఘర్షణలు పటాన్నే మార్చే అవకాశం ఉంది .
ఆర్థిక మార్పు
ఆర్థికాభివృద్ధి, జనాభా మార్పులు ప్రపంచ పటాలను కూడా ప్రభావితం చేస్తాయి అంటున్నారు నిపుణులు. చైనా, భారతదేశం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ శక్తి సమతుల్యతను ప్రభావితం చేస్తున్నాయి . ఈ దేశాల ఆర్థిక, రాజకీయ ప్రభావం పెరగడం ప్రపంచ శక్తి నిర్మాణంలో మార్పుకు దారితీయవచ్చు. ఇది మొత్తం ప్రపంచ పటాన్ని కూడా మార్చవచ్చు .
ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు: ప్రకృతి వైపరీత్యాలు, భౌగోళిక కార్యకలాపాలు కూడా పటంలో గణనీయమైన మార్పులకు కారణమవుతాయి . భూకంపాలు , అగ్నిపర్వత విస్ఫోటనాలు, సునామీలు వంటి సంఘటనలు కొత్త భూ సృష్టికి లేదా భూ విధ్వంసానికి దారితీయవచ్చు . 2011లో జపాన్‌లో సంభవించిన భూకంపం, సునామీ సముద్ర తీరంలో అనేక మార్పులకు కారణమయ్యాయి . భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగవచ్చు .
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.