Dental Surgeon: డెంటల్ సర్జన్ ఉద్యోగాలకు భారీగా పోస్టులు.. ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి

Dental Surgeon:
ప్రతీ రంగంలో కూడా ఇప్పుడు పోటీ పెరిగిపోయింది. చదువుకున్న లక్షల్లో ఉంటే ఉద్యోగాలు మాత్రం వందలు, వేలలో ఉన్నాయి. ఏదో ఒక రంగం అనే కాకుండా అన్ని రంగాల్లో కూడా పోటీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని రంగాల్లో కూడా ఒక్కో పోస్ట్‌కి చాలా పోటీ ఉంది. అయితే మిగతా రంగాలతో పోలిస్తే.. వైద్య రంగం చాలా కష్టంగా ఉంటుంది. ఎవరూ కూడా వీటిని సెలక్ట్ చేసుకోరని కొందరు అంటుంటారు. కానీ ఈ రంగంలో కూడా పోటీ ఎక్కువగానే ఉంది. చాలా మందికి వైద్య విద్య చదవాలని కోరిక ఉంటుంది. కానీ డబ్బులు లేక సీట్ రాలేక చదవలేరు. అయితే కొందరు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చదువుతుంటారు. వైద్య రంగంలో కూడా కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. వాటి బట్టి ఉద్యోగాలు ఉంటాయి. అయితే డెంటల్ సర్జన్ రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే అభ్యర్థులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డెంటల్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇటీవల తెలిపింది.
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) 385 డెంటల్ సర్జన్ పోస్టుల నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ mppsc.mp.gov.in లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. అయితే ఈ ఉద్యోగాలకు అపై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 20 మాత్రమే. అయితే ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఈ నియామం కింద మొత్తం 385 డెంటల్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనుంది. డెంటల్ సర్జన్ విభాగంలో సేవలు అందించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు ఏడాది జనవరి 1వ తేదీకి 21 ఏళ్లు పూర్తి అయి ఉండాలి. గరిష్టంగా అయితే వీరి వయస్సు 40 ఏళ్లు మించకూడదు. అయితే కేటగిరీ బట్టి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది. ఈ విభాగంలో సేవలు అందించాలని ఆసక్తిగా ఉన్నవారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. కేవలం ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కుదురుతుంది.