PM Internship Program: పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్.. అప్లై చేసుకుంటే నెలకు రూ.5 వేల స్టైఫండ్

PM Internship Program:
ఉద్యోగం కోసం ఎందరో కష్టపడుతున్నారు. ఏదైనా ఉద్యోగం సాధించాలంటే ప్రతీ కంపెనీ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. కొత్త వాళ్లను తీసుకోవడం చాలా తక్కువ. దీంతో చాలా మంది ఇంటర్నెషిప్ కోసం ఎక్కువగా ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలు ఎక్కువగా ఇంటర్నెషిప్లను ఇస్తాయి. అయితే కేవలం ప్రైవేట్ కంపెనీలు మాత్రమే ఇంటర్నెషిప్ ప్రోగ్రామ్‌లు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం కూడా ఇస్తోంది. అయితే ప్రభుత్వం ఇచ్చే ఇంటర్నెషిప్ ప్రోగ్రామ్‌ల గురించి పెద్దగా చాలా మందికి తెలియదు. మన దేశంలో ఎందరో నిరుద్యోగులు ఉన్నారు. పది, ఇంటర్, డిగ్రీలు చదివి ఉన్న వారు చాలా మందే ఉన్నారు. వీరికి సరైన ఉద్యోగాలు రాకపోయేసరికి ఏదో ఒక పని చేసుకుంటూ జీవించేస్తున్నారు. ఇలాంటి వారందరికీ కూడా ఈ ఇంటర్నెషిప్ స్కీమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిరుద్యోగుల కోసం మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌ను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ స్కీమ్ వల్ల ఎందరో ఉద్యోగాలు చేస్తారు. వారికి ఉపాథి లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అయితే స్కీమ్ కింద నిరుద్యోగులకు ఏడాది పాటు ఉచితంగా శిక్షణ ఇస్తారు. అలాగే శిక్షణ సమయంలో వారికి నెలకు రూ.5 వేల రూపాయిలు స్టైఫండ్ కూడా ఇస్తారు. దీనివల్ల మీకు నెలకు ఎంతో కొంత డబ్బులు కూడా వస్తాయి. ఆర్థిక సమస్యలతో సతమత మవుతున్న వారికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది.
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ వల్ల ఇవే కాకుండా ఇంకా బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. శిక్షణ పొందుతున్న వారికి ఒకేసారి రూ.60 వేలు ఇస్తారు. అలాగే ప్రధాన్ మంత్రి జీవన్ బీమా, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన వంటి స్కీమ్స్ నుంచి ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. అయితే మొదటి ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుంది. తర్వాత ఆరు నెలలు ఇంటర్న్‌షిప్ చేయాలి. ఇలా చేస్తేనే మీకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం లభిస్తుంది. అయితే ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవాలంటే పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఏదో ఒకటి చదివి ఉండాలి. వీటికి అప్లై చేసుకోవాలనుకునే వారి వయస్సు 21 నుంచి 24 ఏళ్ల మధ్యనే ఉండాలి. అయితే ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 11వ తేదీ. అర్హత ఉన్నవారు https://pminternship.mca.gov.in/login/ వెబ్ సైట్లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఇలా రిజిస్టర్ చేసుకున్నప్పుడు మొబైల్ నంబర్ అడుగుతుంది. మీరు ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత అన్ని వివరాలు ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. ఆసక్తి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి.