Dining Table: డైనింగ్ టేబుల్‌పై వీటిని పొరపాటున పెట్టారో.. ఇక అంతే సంగతులు

Dining Table: కొందరు ఇంట్లో తప్పకుండా వాస్తు నియమాలు పాటిస్తారు. మరికొందరు అసలు వాటిని పట్టించుకోరు. అయితే సాధారణంగా చాలా మంది ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది. కొందరు దీనిపై కేవలం భోజనం మాత్రమే చేస్తారు. మరికొందరు మాత్రం ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని కూడా వీటిపైన పెడతారు. తెలిసో తెలియక డైనింగ్ టేబుల్ మీద కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. డైనింగ్ టేబుల్ విషయంలో ఏ మాత్రం చిన్న పొరపాట్లు చేసినా కూడా ప్రతీ విషయంలో సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. అవేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.
మురికి పాత్రలు
భోజనం చేసిన తర్వాత శుభ్రం చేయని పాత్రలను కొందరు అలాగే వదిలేస్తారు. ఇలా వదిలేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మురికి పాత్రల వల్ల అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పండితులు అంటున్నారు. అందుకే భోజనం అయిపోయిన వెంటనే డైనింగ్ టేబుల్‌ను శుభ్రం చేసుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా టేబుల్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పండితులు అంటున్నారు.
విరిగిపోయిన వస్తువులు
కొందరు డైనింగ్ టేబుల్‌ను పెద్దగా వాడమని లేకపోతే అందంగా తయారు చేయడానికి విరిగిపోయిన వస్తువులను పెడుతుంటారు. ఇలా డైనింగ్ టేబుల్ మీద విరిగిపోయిన వాటిని, కొవ్వొత్తులను పెడితే ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుందని పండితులు అంటున్నారు. దీనివల్ల పేదరికం కూడా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ముళ్ల మొక్కలు
డైనింగ్ టేబుల్‌పై అందంగా కనిపించడానికి కొందరు ముళ్లతో ఉన్న మొక్కలను పెడతారు. వీటిని డైనింగ్ టేబుల్‌పై పెట్టడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాన్ని పోతాయని పండితులు అంటున్నారు. అలాగే బంధాల్లో దూరాన్ని, అపార్థాలను పెంచుతాయని కొందరు నమ్ముతారు. అందుకే డైనింగ్ టేబుల్‌పై ముళ్ల మొక్కలకు బదులుగా, పూల మొక్కలు లేదా ఆకుపచ్చని మొక్కలను పెట్టడం మంచిదని అంటున్నారు.
పాడైపోయిన ఆహారం
డైనింగ్ టేబుల్‌పై పాడైపోయిన ఆహార పదార్థాలు లేదా కుళ్లిన పండ్లు ఉంచకూడదు. వీటి వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తిని విడుదల చేస్తాయి. ఆహారం పాడైపోయినా, పండ్లు కుళ్లిన వాటిని తొలగించాలి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Viral Video : వీడికి ఎన్ని గుండెలు.. 15అడుగుల కొండచిలువతో చిన్నారి ఆట