Viral Video: హోరుమని ఇసుక కమ్మేస్తే.. సముద్రం కూడా వణికిపోయింది.. వైరల్ వీడియో
Viral Video: మనకు వర్షాకాలంలో తుఫాన్లు ఏర్పడటం సర్వసాధారణం. కొన్నిసార్లు భీకరమైన తుఫాన్లు కూడా ఏర్పడుతుంటాయి. ఆ సమయంలో ప్రచండమైన గాలులు వీస్తుంటాయి. వర్షాలు కూడా విపరీతంగా కురుస్తుంటాయి. నష్టం అపారం గా ఉంటుంది.
మైదాన ప్రాంతాల్లో ఏర్పడే తుఫాన్లు కలిగించే నష్టం దాన్ని తీవ్రత పై ఆధారపడి ఉంటుంది. ఇక ఎడారి ప్రాంతాల్లో కూడా తుఫాన్లు ఏర్పడుతుంటాయి. ఆ సమయంలో ఇసుక దూసుకు వస్తూ ఉంటుంది. మేఘాల మాదిరిగా కమ్మేస్తూ ఉంటుంది. గాలుల తీవ్రత అధికంగా ఉంటే ఇసుక తుఫాను తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో దానికి గనక ఎదురుగా వెళితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. సోషల్ మీడియాలో ఇసుక తుఫాన్ కు సంబంధించిన ఓ వీడియో తెగ సందడి చేస్తోంది. ఆ వీడియోలో ఇసుక తుఫాన్ సముద్రం మీదుగా వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అది చూసిన వారికి ఒళ్ళు జలదరించేలా చేసింది. అది చూసిన వాళ్లకి హాలీవుడ్ సినిమాలోని గ్రాఫిక్స్ సన్నివేశం లాగా కనిపించింది.. సముద్రంలో ఓ ఓడ ప్రశాంతంగా వెళ్తోంది. ఆ సమయంలో ఓడ ముందుగా ఇసుక మేఘం ఏర్పడింది. అది ముసురుకుంటూ వచ్చేసింది. చూస్తుండగానే సముద్రాన్ని దాటి ఓడను ఇసుకమేఘం పూర్తిగా ఆక్రమించింది. ఇటువంటి ఇసుక తుఫాన్లను హబూబ్ అని పిలుస్తుంటారట. మనదేశంలో థార్ వంటి ఎడారి ఉన్నప్పటికీ తుఫాన్లు అరుదుగా ఏర్పడుతుంటాయి. కానీ సహారా, అట కామా ఎడారిలో ఇలాంటి ఇసుక తుఫాన్లు సర్వసాధారణం.. గల్ఫ్, ఆఫ్రికాలోని కొన్ని దేశాల ప్రజలు ఇసుక తుఫాను అంటే పెద్దగా భయపడరు. ఎందుకంటే వారికి ఇసుక తుఫాన్లు చూడటం అలవాటు కాబట్టి.
ఎందుకు ఏర్పడతాయంటే..
ఎడారి ప్రాంతాల్లో ఇసుక తుఫాన్లు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. పొడి వాతావరణంలో.. తీర ప్రాంతాలలో బలమైన గాలులు వీచడం వల్ల ఇసుక తుఫాన్లు ఏర్పడుతుంటాయి. వేడిగాలి ఉన్నట్టుండి అధిక వేగంతో వీచినప్పుడు.. అది ఒకసారి గా పైకి లేస్తుంది. ఆ సమయంలో ఇసుక కూడా దానితో పాటు ఉంటుంది. ఇలాంటి దృశ్యాలు ఎడారి ప్రాంతాల్లో జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు సముద్రతీర ప్రాంతంలో ఇలాంటి ఇసుక తుఫాన్ ఏర్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అరుదైన సందర్భాల్లో ఇసుక తుఫాన్లు సముద్రాన్ని చేరుకుంటాయి. ఆ సమయంలో అవి అత్యంత ప్రమాదకరంగా మారుతాయి. ఇసుక తుఫాన్ వల్ల ఓడలు కూడా ప్రమాదాలకు గురవుతుంటాయి. ఇప్పటిక సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోను ఇప్పటికే లక్షల మంది చూశారు. వేలమంది ఇష్టపడ్డారు. అయితే చాలామందికి సముద్రంలోనూ ఇసుక తుఫాన్ ఏర్పడుతుందనే విషయం తెలియదు. ఈ వీడియో చూసిన తర్వాత చాలామందికి అది అవగతమైనది. ఆ వీడియో చూసిన చాలామంది హాలీవుడ్ సినిమాలో దృశ్యం మాదిరిగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరి కొంతమంది అయితే అక్కడ ఉన్న వాళ్ల పరిస్థితి ఏమిటో.. ప్రకృతి తలచుకుంటే ఏదైనా సాధ్యమే అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు..
Enormous sand storm engulfs these ships at sea pic.twitter.com/UHdhRmzTYN
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 14, 2025