Viral Video: చీర కట్టుకోరాదా? ఎంత కు తెగించారమ్మా? వైరల్ వీడియో
నుదుటన పావల బిళ్ళ పరిమాణంలో బొట్టు. ఆ కొప్పులో మల్లెపూలు.. చక్కగా సింగారించుకొని కట్టుకున్న చీర.. చదువుతుంటే మూర్తివభవించిన భారతీయ స్త్రీ కళ్ళ ముందు కదలాడుతోంది కదూ. కనిపించగానే చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపిస్తోంది కదూ..

Viral Video: మన భారతీయ మహిళల కట్టు, బొట్టు అనేవి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచాయి. అందు గురించే ప్రపంచ దేశాలలో మహిళలు మన భారతీయ స్త్రీలు అనుసరిస్తున్న వస్త్ర కట్టుబాట్లను పాటించడానికి రెడీ అవుతున్నారు. మనదేశంలో చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థినిలు మన కట్టుబాట్లను పాటించడానికి ముందుకు వస్తున్నారు. కానీ మనదేశంలో మాత్రం చాలా మందికి మన కట్టు.. మన బొట్టు నచ్చడం లేదు. సాంప్రదాయానికి, సంస్కృతికి అసలైన అర్థం గా నిలిచే చీరను కట్టుకోవడం వారి వల్ల కావడం లేదు. అందుకే ప్రతి దాంట్లో రెడీమేడ్ వచ్చినట్టు.. చీర కట్టుడు లో కూడా రెడీమేడ్ విధానం అందుబాటులోకి వచ్చేసింది. దానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ కనిపిస్తోంది.
రెడీమేడ్ చీర
సాధారణంగా వెనుకటి తరం మహిళలు చీరలు కట్టుకోవడాన్ని ఇష్టపడుతుంటారు. పాశ్చాత్య దుస్తులు ధరించడాన్ని వారు అంగీకరించరు. ఇప్పుడు ప్రపంచం మొత్తం గ్లోబల్ విలేజ్ గా మారిన నేపథ్యంలో.. మన చీరకట్టు అనేది ఒక తరం వరకే పరిమితమైపోతుంది. ఈ తరంలో ఆడవాళ్లు కేవలం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయంలోనే చీరలు కట్టుకోవడానికి ఇష్టాన్ని చూపిస్తున్నారు. అయితే ఆ చీర కట్టు కూడా వారికి రావడం లేదు. అలాంటి వారి కోసం ఏకంగా రెడీమేడ్ చీరలు అందుబాటులోకి వచ్చాయి. అంటే రెడీమేడ్ దోవతులు ధరించినట్టుగానే.. రెడీమేడ్ చీరలు అన్నమాట.. కట్టుకోవడానికి ప్రయాస పడకుండానే.. జస్ట్ అలా రెండు నాడాలు(పొట్ట కింది భాగంలో ఏర్పాటు చేశారు) కట్టుకుంటే చాలు.. చీరను కట్టేసుకున్నట్టే. జస్ట్ రెండు నిమిషాల్లోనే అయిపోతుంది. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తోంది. అయితే దీనిని చూసిన చాలామంది నెటిజెన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. కలికాలంలో ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాలో అంటూ వాపోతున్నారు. మన సంప్రదాయానికి, సంస్కృతికి ప్రతీక అయిన చీరను కట్టుకోవడం కూడా ఈ తరానికి రావడం లేదని.. చివరికి చీర కూడా రెడీమేడ్ దోవతి లాగా అయిపోయిందని వాపోతున్నారు. అసలు ఇలాంటి విధానం కనుక మార్కెట్లో మరింత అందుబాటులోకి వస్తే ఈ తరం వారికి చీర గురించి గానీ.. దానిని కట్టుకోవడం గురించి కానీ తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ” చీర మన సంస్కృతికి ప్రతీక లాంటిది. దాన్ని కూడా రెడీమేడ్ వస్తువును చేశారు. ఇంకా ఇలాంటివి ఎన్ని చేస్తారో.. మనకంటూ మన సంస్కృతి మీద ఒక పేటెంట్ హక్కు ఉంటుంది. దాన్ని కూడా ఇలా చేయడం ఎంతవరకు సబబు.. ఇలా చేయడం వల్ల బద్ధకం పెరిగిపోతుంది. అది మనకు మన సంస్కృతిని దూరం చేస్తుందని” నెటిజన్లు వాపోతున్నారు.
ఎంత కు తెగించారు రా
చీర కట్టడం రాకుంటే నేర్చుకోవాలి కానీ
ఇలాంటి వి వేసుకుని మోసం చేస్తారా 😐 pic.twitter.com/i7zU1y5dn5— ismailbhaii (@atheisttindiann) April 19, 2025