Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్

Sonu Sood : సోనూ సూద్ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించిన నిజ జీవితంలో మాత్రం కరోనా సమయంలో కోట్లాది మందికి అండగా నిలిచి రియల్ హీరోగా మారారు. కరోనా మహమ్మారి సమయంలో పేదలకు, వలస కార్మికులకు అండగా నిలబడి, వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చడంలో ఆయన చూపిన మానవత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడంలో సోనూ సూద్ ముందున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయనను విమర్శించిన వారికి గట్టిగా బుద్ది వచ్చే విధంగా సమాధానం ఇచ్చారు.
లాతూర్ జిల్లాకు చెందిన ఓ వృద్ధ రైతుకు తన పొలాన్ని దున్నడానికి ఎద్దులు లేకపోవడంతో తనే కాడికి కట్టకుని దున్నడం ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, నటుడు సోనూ సూద్ ఆ రైతుకు ఎద్దులను పంపించి సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. “మీరు నంబర్ పంపించండి, నేను ఎద్దులను పంపిస్తాను” అని ఆయన తన ఎక్స్ లో ట్వీట్ చేశాడు. ఆ తర్వాత, ఒక నెటిజన్ సోనూ సూద్ సహాయంపై ప్రశ్నలు లేవనెత్తాడు. సోనూ సూద్ బృందం 5% సహాయం చేస్తే తన 95% ప్రచారం చేస్తుందని ఆ యూజర్ ఆరోపించాడు. ఇప్పుడు సోనూ సూద్ స్వయంగా ఈ యూజర్‌కు తగిన జవాబు ఇచ్చాడు. లాతూర్ రైతుకు అందించిన ఆర్థిక సహాయం రసీదును షేర్ చేస్తూ ఆ ట్రోలర్ నోరు మూయించాడు.
Read Also:Children’s Growth : పిల్లల ఆరోగ్యానికి ఏమిటి మంచిది? వారికి వరస్ట్, బెస్ట్ ఆప్షన్లు ఇవే
मेरे हिस्से की मदद तो मैंने पहले ही हमारे किसान अंबादास भाई की कर दी थी।
अब अपने हिस्से की घास आप भी भेज देना 🙏
क्या है ना भाई, ट्विटर पे ज़हर फैलाने से देश नहीं चलेगा। किसी और को मदद पहुँचाना हो तो मेसेज कर देना 🙏
जय हिन्द 🇮🇳 https://t.co/E3jsMP0w3X pic.twitter.com/WxMd0IxjjW— sonu sood (@SonuSood) July 7, 2025
వృద్ధ రైతు ఫోటోను షేర్ చేస్తూ, ఆ ట్రోలర్ ఇలా రాశాడు: “ఈ రైతు ఫోటో మీకు గుర్తుందా? నటుడు సోనూ సూద్ ‘మీరు నంబర్ పంపించండి, నేను ఒక ఎద్దును పంపిస్తాను’ అని రాశాడు. సోనూ టీమ్ 5% సహాయం చేసి, 95% ప్రచారం చేస్తుందని నేను గమనించాను. చేతులతో వ్యవసాయం చేస్తున్న వ్యక్తికి ట్విట్టర్ గురించి ఎలా తెలుస్తుంది. ఏదేమైనా, సోనూ సహాయం చేసి ఉంటే, చెప్పండి, నేను దాని గురించి కూడా రాస్తాను.” అంటూ రాసుకొచ్చాడు.
ఈ ట్వీట్‌కు సోనూ సూద్ స్వయంగా స్పందించారు. ఆర్థిక సహాయం చేసిన రసీదును షేర్ చేస్తూ, “నేను ఇప్పటికే నా రైతు అంబాదాస్ భావు గారికి నా వంతు సహాయం చేశాను. ఇప్పుడు మీరు మీ వంతు మేతను కూడా పంపించాలి. ట్విట్టర్‌లో విషం చిమ్మడం వల్ల దేశం నడవదు. మీరు ఇతరులకు సహాయం పంపించాలనుకుంటే, నాకు మెసేజ్ చేయండి” అని సోనూ సూద్ అన్నారు.
Read Also:Internet Speed : నెట్‌ఫ్లిక్స్ మొత్తం ఒక్క సెకన్‌లో డౌన్‌లోడ్..ఇంటర్నెట్ స్పీడ్‌లో జపాన్ సంచలనం!
సోనూ సూద్ ఈ రైతుకు ఒక జత ఎద్దులను ఇవ్వాలనుకున్నారు. అయితే, రైతు సంఘం కార్యకర్తలు అప్పటికే ఆ రైతుకు ఒక జత ఎద్దులను బహుమతిగా ఇవ్వడంతో, సోనూ సూద్ ఆ రైతుకు రూ. 45,000 నగదు పంపించారు. సోనూ సూద్ ఈ పనికి సైలెంటుగానే సహాయం చేశాడు, కానీ విమర్శలు వచ్చిన తర్వాత మాత్రమే ఆ రసీదును షేర్ చేయాల్సి వచ్చింది.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Annadata Sukhibhava : రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే అన్నదాత సుఖీభవ.. లిస్టులో పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి
-
Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!