Annadata Sukhibhava : రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే అన్నదాత సుఖీభవ.. లిస్టులో పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి

Annadata Sukhibhava : ఏపీ రైతులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సాయం కోసం రైతులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ పథకానికి అర్హుల ఎంపిక పూర్తయిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఢిల్లీ రావు స్పష్టం చేశారు. అయితే, కొంతమంది అర్హులు ఉన్నా జాబితాలో తమ పేరు లేదని చెబుతున్నారు. అలాంటి రైతులు ఆందోళన చెందకుండా, వెంటనే అధికారులను సంప్రదించి తమ సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం సూచిస్తోంది. అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు వస్తాయి, అర్హత ఎలా తెలుసుకోవాలి, పేరు లేకపోతే ఏం చేయాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పథకంలో పేరు లేకపోతే ఏం చేయాలి?
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నప్పటికీ జాబితాలో తమ పేరు లేదని భావించే రైతులు వెంటనే గ్రామంలోని వ్యవసాయ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్‌ను, లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి మీ సమస్యను వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అధికారులు ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. దీని వల్ల మీ దరఖాస్తును మళ్ళీ పరిశీలించే అవకాశం ఉంటుంది. లేకపోతే మీ సమీపంలోని సెక్రటేరియట్ కు వెళ్ళండి. అక్కడ ఆర్బీకే అధికారి అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించి మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. పేరు లేకపోతే అక్కడే ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
Read Also : Viral : తప్పతాగి స్పూన్ మింగేశాడు.. తెలియకుండానే ఆర్నెళ్లు గడిపిన ఘనుడు
అర్హతను ఎలా తెలుసుకోవాలి?
ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అర్హత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఓ సులభమైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. రైతులు తమ ఆధార్ నంబర్‌తో అన్నదాత సుఖీభవ పోర్టల్ లోకి లాగిన్ అయి, తమ అర్హత వివరాలను తెలుసుకోవచ్చు. ఇది చాలా సులభంగా ఉండేలా రూపొందించబడిందని అధికారులు చెబుతున్నారు. మీకు ఏమైనా సందేహాలున్నా, లేదా సమస్యలు ఉన్నా, రైతులు టోల్-ఫ్రీ నంబర్ 155251 కు ఫోన్ చేసి తమ వివరాలను చెప్పవచ్చు. ఈ సేవలు జులై 5వ తేదీ నుంచే అందుబాటులోకి వచ్చాయి. మీ పేరు ఎందుకు అర్హత జాబితాలో లేదో వంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అవసరమైతే ఫిర్యాదును కూడా నమోదు చేయవచ్చు.
అర్హులైన ప్రతిరైతుకు న్యాయం
పథకం అమలులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేలా వ్యవసాయ శాఖ పనిచేస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Read Also : Prabhas : ప్రభాస్ చెల్లెలు చేసిన పనికి నెట్టింట రచ్చ.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
డబ్బులు ఎప్పుడు వస్తాయి?
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.7,000 వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మొత్తం పీఎం కిసాన్ కింద వచ్చే రూ.2,000 కు అదనం. అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ప్రత్యేకంగా రూ.5,000 అందించనుంది. పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయో అదే రోజు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయనే ఖచ్చితమైన తేదీ ఇంకా తెలియదు. అయితే, ఈ డబ్బులు వచ్చే కొద్ది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.