Prabhas : ప్రభాస్ చెల్లెలు చేసిన పనికి నెట్టింట రచ్చ.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Prabhas : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్‌లు అందుకుని ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు ది రాజా సాబ్ సినిమాతో మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు డార్లింగ్. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌లో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ సంజయ్ దత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ప్రభాస్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.
‘ది రాజా సాబ్’తో పాటు ప్రభాస్ చేతిలో చాలా పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజి, వయలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ , అలాగే కల్కి 2, సలార్ 2 వంటి సినిమాలు కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. అంతేకాకుండా హనుమాన్ ఫేం ప్రశాంత్ వర్మతోనూ ఒక సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది.
Read Also:Viral : తప్పతాగి స్పూన్ మింగేశాడు.. తెలియకుండానే ఆర్నెళ్లు గడిపిన ఘనుడు
ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రభాస్‌కు నలుగురు చెల్లెళ్లు ఉన్న సంగతి తెలిసిందే. వీరంతా దివంగత నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కూతుళ్లు. ఈ నలుగురితో ప్రభాస్ ఎంతో సరదాగా, ప్రేమగా ఉంటాడు. ఈ నలుగురు చెల్లెళ్లలో ఇప్పటికే ప్రసీద ప్రొడక్షన్ ఫీల్డులోకి అడుగు పెట్టింది. తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది. అలాగే, ప్రభాస్ సినిమా ఈవెంట్లలోనూ పాల్గొంటూ ఉంటుంది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ప్రసీద, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఈ ఏడాదిలో గడిచిన ఆరు నెలల్లో ఏం జరిగిందో తెలియజేస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోలను అందులో షేర్ చేసింది. ఇందులో ఆమె తల్లి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కూడా ఉన్నారు.
Read Also:Banks: ఈ బ్యాంకులకు ఇకపై మినిమం బ్యాలెన్స్ ఉండక్కర్లేదు.. ఆ బ్యాంకులు ఏవంటే?
“హాఫ్ వే దేర్.. 2025” అంటూ ప్రసీద షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధం, ప్రభాస్ ఇంట్లో ఎంత సరదాగా ఉంటాడు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, ప్రభాస్‌తో ఉన్న ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఫొటోలను చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్‌ను ఇంట్లో అలా చూసి చాలా సంతోషిస్తున్నారు.
-
RGV Sensational Comments: సందీప్ వంగా, దీపికా పదుకొణె ఇష్యూపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!
-
Prabhas : ప్రభాస్ వింటేజ్ లుక్స్ రీలోడెడ్.. ‘ఫౌజీ’ నుంచి వైరల్ అవుతున్న ఫోటోతో ఫ్యాన్స్ ఫిదా!