Prabhas : ప్రభాస్ వింటేజ్ లుక్స్ రీలోడెడ్.. ‘ఫౌజీ’ నుంచి వైరల్ అవుతున్న ఫోటోతో ఫ్యాన్స్ ఫిదా!

Prabhas : బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదు. ఇండియాలోనే పెద్ద స్టార్‌గా మారిపోయాడు. అయితే, వరుస ప్లాప్‌లు వచ్చినా, హిట్లు వచ్చినా కూడా అభిమానులకు ఒక చిన్న నిరాశ ఉండేది. అదే ప్రభాస్ లుక్స్ గురించి. బాహుబలి రోజుల్లో ప్రభాస్ ఎంత అందంగా ఉండేవాడో, ఇప్పుడు అలా లేడు అని చాలా మంది ఫ్యాన్స్ ఫీలయ్యారు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా, రెండు గంటలు ప్రభాస్ అందాన్ని చూడటానికి థియేటర్‌కు వెళ్ళే లక్షలాది మంది ప్రేక్షకులు ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. ప్రభాస్ తన వింటేజ్ లుక్స్‌లోకి తిరిగి వస్తున్నాడని తెలుస్తోంది.
‘ఫౌజీ’ నుండి లీకైన ఫోటో
బాహుబలి తర్వాత వచ్చిన ఐదు సినిమాలలో సలార్ లో మాత్రమే ప్రభాస్ లుక్స్ కొంచెం పర్వాలేదనిపించాయి. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో లీకైన ఒక ఫోటో చూస్తే, ప్రభాస్ తన పాత వింటేజ్ లుక్స్‌లోకి తిరిగి రావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఫోటో హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించినదని తెలుస్తోంది. ఈ లుక్స్ చూసి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. పాత ప్రభాస్ తిరిగి వస్తున్నాడని సంబరపడిపోతున్నారు.
Read Also:Drinking Water: దాహం వేయడం లేదని వాటర్ తగ్గిస్తే.. ఆయుష్షు తగ్గిపోవడం పక్కా!
Bro getting back to normal look… Idi just Hanu Raghavpudi class touch … Next Mental Mass Vanga 🥵 pic.twitter.com/KZSL36knxy
— Gautham Reddy (@Sama_Gautham_) July 1, 2025
వింటేజ్ ప్రభాస్ షూర్ షాట్
ఇటీవలే విడుదలైన రాజా సాబ్ టీజర్లో ప్రభాస్ తన పాత కామెడీ టైమింగ్‌ను బయటపెట్టాడు. ఇప్పుడు హను రాఘవపూడి ఫౌజీలో తన వింటేజ్ లుక్స్‌ను తిరిగి తీసుకొస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ సినిమాతో పూర్తిస్థాయి వింటేజ్ ప్రభాస్ తిరిగి వస్తాడని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు పూర్తయ్యాక, ‘రాజా సాబ్’ మిగిలిన షూటింగ్‌ను కంప్లీట్ చేస్తాడు.
డిసెంబర్ 5న రాజా సాబ్ రిలీజ్
రాజా సాబ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎక్కువగా పాన్-ఇండియా సినిమాలు చేస్తూ, లోకల్ మాస్ సినిమాలకి దూరమయ్యాడు. దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అతని సినిమాలను చూడటం తగ్గించేశారు. ఇప్పుడు ఆడియన్స్‌ను మళ్ళీ థియేటర్లకి రప్పించడానికి ఒక పక్కా లోకల్ మాస్ సినిమా చాలా అవసరం. రాజా సాబ్ ఆ అవసరాన్ని తీరుస్తుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. టీజర్ ఒక్కటే అభిమానులకు స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. సినిమా కూడా అదే రేంజ్లో ఉంటే, ఇది మరో వెయ్యి కోట్ల సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు. అది గనుక నిజం అయితే దేశంలోనే 3000కోట్ల హీరోగా ప్రభాస్ నిలిపోవడం గ్యారంటీ.
Read Also:Relationship Tips: మీకు భాగస్వామి ఉందని గుర్తించండి.. మరిచిపోయారా ఇక పెంటే!
-
Rajasaab Run Time: రాజాసాబ్ రన్ టైమ్ ఎంతంటే
-
RGV Sensational Comments: సందీప్ వంగా, దీపికా పదుకొణె ఇష్యూపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali : బాహుబలి రీ యూనియన్‌లో అనుష్క, తమన్నా కనిపించలేదు.. అందుకే రాలేదా ?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
Prabhas : ప్రభాస్ చెల్లెలు చేసిన పనికి నెట్టింట రచ్చ.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ