Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?

Baahubali the Epic: తెలుగు సినిమాను, భారత సినిమాను ప్రపంచానికి పరిచయం చేసింది ‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు అయ్యింది. ఇందులో ప్రభాస్ హీరోగా నటించగా రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా వచ్చింది. అయితే సినిమా రిలీజ్ అయ్యి పదేళ్లు కావడంతో డైరెక్టర్ రాజమౌళి దీని కోసం ఓ గుడ్ న్యూస్‌ను తెలిపారు. రిలీజ్ అయి పదేళ్లు కావడంతో ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రెండు పార్ట్‌లను కలిపి ఒకే పార్ట్‌గా రీరిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీన్ని ఎడిట్ చేసి మొత్తం ఒకే పార్ట్‌లో కొత్త వెర్షన్‌ను విడుదల చేయనున్నారు. ఈ బాహుబలి ఎపిక్‌ను ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇది తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
బాహుబలి రిలీజ్‌తో ఫ్యాన్స్ ఎంతగానో ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాకమైన బాహుబలి మూవీని థియేటర్లలో చూడలేదని చాలా మంది బాధపడ్డారు. అలాంటి వారికి ఇది హ్యాపీ న్యూస్ అని చెప్పవచ్చు. ‘బాహుబలి: ది బిగినింగ్’ (2015), ‘బాహుబలి: ది కంక్లూజన్’ (2017) రెండు పార్ట్‌లను కలిపి బాహుబలి ది ఎపిక్‌గా రాజమౌళి రీరిలీజ్ చేయనున్నారు. నేటితో సరిగ్గా రిలీజ్ అయ్యి పదేళ్లు కావడంతో రీరిలీజ్‌ను ప్రకటించారు. అయితే ఈ సినిమాతో తెలుగు మూవీ సీక్వెల్, పాన్ ఇండియా వంటి వాటిని పరిచయం చేశారు. రాజమౌళి తర్వాతే అందరూ వీటిని చేయడం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో ‘బాహుబలి: ది బిగినింగ్’ రూ.650 కోట్లు వసూలు చేయగా, ‘బాహుబలి 2’ రూ.1788.06 కోట్లు వసూలు చేసింది. మరి ఇప్పుడు రీరిలీజ్ అయితే ఎంత కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.
బాహుబలి ది ఎపిక్ అన్సౌన్స్‌మెంట్ చేయగానే చాలా మంది మహేష్ ఫ్యాన్స్ స్పందించారు. మహేష్ బాబు సినిమాపై అప్డేట్ ఇవ్వండని కామెంట్లు చేస్తున్నారు. అసలు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందా? లేదా? అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ కూడా లేదని, ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ అంటే.. ఇంకా ఆ మూవీ వచ్చేది ఎప్పుడో అని మహేష్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మషేహ్, రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని కొన్ని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. షూటింగ్‌కి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ అఫీషియల్‌గా అయితే ఈ సినిమా కోసం ఎలాంటి అప్డే్ట్ ఇవ్వలేదు. మరి దీనిపై అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఇది కూడా చూడండి: Ramayana : రామాయణం కోసం షాకింగ్ టెక్నాలజీ.. ఏకంగా 86 కెమెరాలతో షూటింగ్
-
SSMB29 Update: ఆర్ఆర్ఆర్ టీంను పక్కనపెట్టిన రాజమౌళి.. మహేష్ మూవీ కోసం కొత్త టీం..
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి
-
Prabhas : ప్రభాస్ చెల్లెలు చేసిన పనికి నెట్టింట రచ్చ.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
-
Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!
-
Prabhas : ప్రభాస్ వింటేజ్ లుక్స్ రీలోడెడ్.. ‘ఫౌజీ’ నుంచి వైరల్ అవుతున్న ఫోటోతో ఫ్యాన్స్ ఫిదా!