Ramayana : రామాయణం కోసం షాకింగ్ టెక్నాలజీ.. ఏకంగా 86 కెమెరాలతో షూటింగ్

Ramayana : కాలానుగుణంగా సినిమా నిర్మాణంలో టెక్నాలజీ వాడకం పెరుగుతోంది. ఆధునిక కెమెరాల వాడకంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు రాబోయే రామాయణం కూడా అలాంటి సినిమానే కాబోతుంది. దర్శకుడు నితీష్ తివారీ షూటింగ్ కోసం ఏకంగా 86 కెమెరాలను ఉపయోగించారని తెలుస్తోంది. అంతేకాకుండా, వీఎఫ్ఎక్స్ మెషీన్లను కూడా వాడారని సమాచారం. రామాయణం సినిమాలో కౌసల్య పాత్రను పోషిస్తున్న నటి ఇందిరా కృష్ణన్ ఈ సినిమాలోని లేటెస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ దూరదృష్టిని ఆమె ప్రశంసించారు.
ఆమె మాట్లాడుతూ.. “నేను బాడీ కొలతలు ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఇంటర్స్టెల్లర్ సినిమాలో ఉపయోగించిన వీఎఫ్ఎక్స్ మెషీన్ ఇక్కడ కూడా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా, 86 ప్రదేశాలలో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒకేసారి ఆ అన్ని కెమెరాలు నన్ను చిత్రీకరించాయి. అది చూసి నేను షాకయ్యాను” అని ఇందిరా కృష్ణన్ అన్నారు.
Read Also:Smartphone : కంపెనీల స్టాక్ క్లియరెన్స్ ప్లాన్.. భారీగా తగ్గనున్న స్మార్ట్ ఫోన్ ధరలు
టెక్నాలజీతో పక్కా ప్లానింగ్!
“నా బాడీ కొలతలు కేవలం కాస్ట్యూమ్ డిజైన్ కోసం మాత్రమే కాదు. వీఎఫ్ఎక్స్ బెనిఫిట్స్ కోసం కూడా తీసుకున్నారు. ఇది విని నాకు షాక్ తగినట్లు అయింది. కౌసల్య ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి అనేది ముందుగానే ప్లాన్ చేసి ఉంటుంది. ఇక్కడ డ్రామా డైలాగ్‌లకు అవకాశం లేదు” అని ఆమె అన్నారు.
ఇందిరా కృష్ణన్ గతంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రంలో రష్మిక మందన్నా తల్లి పాత్రలో కనిపించారు. రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, అరుణ్ గోవిల్ దశరథుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా 2026 దీపావళికి విడుదల కానుంది.
Read Also:Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Ramayana Movie Budget: రామాయణ బడ్జెట్ ఇన్ని కోట్లా.. ఇండియాలో అధిక బడ్జెట్ మూవీ ఇదేనా!
-
Ramayana : రావణుడి క్రేజ్ రాముడిని డామినేట్ చేసిందా.. రామాయణ గ్లింప్స్ పై ట్రోలర్స్ ఇదే చెబుతున్నారా ?
-
Ramayana movie first glimpse review: రామాయణ ఫస్ట్ గ్లింప్స్ రివ్యూ: ఏదో మిస్ అవుతుంది
-
Yash : ‘బాస్’ నంబర్ ప్లేట్.. రూ.3 కోట్ల లగ్జరీ కారు.. యశ్ రేంజే వేరు
-
Alia Kapoor : పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్.. ఇక నుంచి తనను అలాగే పిలవాలట
-
Katrina Kaif : సల్మాన్-రణ్బీర్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? షాకింగ్ ఆన్సర్ చెప్పిన కత్రినా