Yash : ‘బాస్’ నంబర్ ప్లేట్.. రూ.3 కోట్ల లగ్జరీ కారు.. యశ్ రేంజే వేరు

Yash : కేజీఎఫ్ సినిమాతో ఇండియాలో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన రాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. కేవలం సినిమాలు మాత్రమే కాదు, ఆయన లగ్జరీ లైఫ్ స్టైల్ కూడా ఆయన అభిమానుల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఇటీవల యశ్ కొన్న ఒక కొత్త లగ్జరీ కారు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ కారు ధర, దాని అల్ట్రా-లగ్జరీ ఫీచర్లు, ముఖ్యంగా దాని నంబర్ ప్లేట్ గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.
తన కొత్త సినిమా టాక్సిక్ షూటింగ్ కోసం ముంబైలోనే ఎక్కువ సమయం గడుపుతున్న యశ్, అక్కడి అవసరాల నిమిత్తం ఓ కొత్త, అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఆ కారు పేరు లెక్సస్ LM 350h 4-సీటర్ అల్ట్రా లగ్జరీ. ఈ కారు భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత విలాసవంతమైన MPVలలో ఒకటి. బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, షారుఖ్ ఖాన్ వంటి కొద్దిమంది సెలబ్రిటీల వద్ద మాత్రమే ఈ కారు ఉంది.
ఈ నీలి రంగు కారుకు మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ (MH 47 CB 8055) చేయించాడు. ఈ కారు ఎక్స్-షోరూం ధర దాదాపు రూ.2.63 కోట్లు కాగా, ఆన్-రోడ్ ధర రూ.3 కోట్ల వరకు ఉంటుంది. ఇది నిజానికి MPV అయినప్పటికీ దీని డిజైన్, సౌకర్యాలు లగ్జరీ కార్ల కంటే గొప్పగా ఉంటాయని చెబుతారు.
Read Also:Kannappa Movie Collections: రూ.50 కోట్ల క్లబ్‌లోకి కన్నప్ప.. బ్రేక్ ఈవెన్‌కు సమయం పడుతుందా?
యశ్ కారు ధర ఎంత హైలైట్ అయిందో, దాని నంబర్ ప్లేట్ కూడా అంతే చర్చనీయాంశంగా మారింది. ఆ కారు నంబర్ ‘8055’. ఈ నంబర్‌ను స్టైలిష్‌గా రాస్తే ‘BOSS’ (బాస్) లాగా కనిపిస్తుంది. అందుకే చాలామంది సెలబ్రిటీలు, ధనవంతులు ఈ నంబర్‌ను ప్రత్యేకంగా కోరుకుంటారు.
ఈ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కోసం లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో ఈ తరహా VIP నంబర్ల కోసం RTO వేలంపాటలు నిర్వహిస్తుంది. యశ్ తన అన్ని కార్లకు ‘8055’ నంబర్‌నే ఉపయోగిస్తున్నాడు. ఇది ఆయనకు ‘బాస్’ అనే బ్రాండ్ ఇమేజ్‌ను మరింత బలంగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ లెక్సస్ కారును యశ్ తన సొంత నిర్మాణ సంస్థ ‘మాన్ స్టర్ మైండ్స్’ పేరు మీద రిజిస్టర్ చేయించాడు.
Read Also:Hero Ram Pothineni: టాలీవుడ్ హీరోకి చుక్కలు చూపించిన మందు బాబులు.. అసలేమైందంటే?
లెక్సస్ LM 350h లో ఉన్న లగ్జరీ ఫీచర్లు:
లెక్సస్ LM 350h లోపల కూర్చుంటే ఒక ప్రైవేట్ జెట్‌లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని చెబుతారు. ఈ కారు పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్‌తో నడుస్తుంది. ఇది మంచి పెర్ఫార్మెన్స్ తో పాటు మైలేజ్ కూడా ఇస్తుంది.
అల్ట్రా-కంఫర్ట్ సీట్లు: ఇందులో ఉండే హీటెడ్-వెంటిలేటెడ్ రిక్లైన్ సీట్లు పూర్తిగా వెనక్కి పడుకోవడానికి వీలు కల్పిస్తాయి. వీటిలో మసాజర్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ప్రైవసీ పార్టిషన్: ముందు డ్రైవర్ సీటు, వెనుక ప్యాసింజర్ సీటు మధ్య ఒక గోడ లాంటి పార్టిషన్ ఉంటుంది. దీనిని కావాలంటే అద్దంలా మార్చుకోవచ్చు లేదా ప్రైవసీ కోసం పూర్తిగా మూసివేయొచ్చు.
48-అంగుళాల స్క్రీన్: వెనుక సీట్లలో కూర్చున్న వారి కోసం ఏకంగా ఒక పెద్ద 48-అంగుళాల అల్ట్రా-వైడ్ స్క్రీన్ ఉంటుంది.
అద్భుతమైన సౌండ్ సిస్టమ్: 23 స్పీకర్లతో కూడిన మార్క్ లెవిన్సన్ 3D సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. అది ఒక థియేటర్ అనుభూతిని ఇస్తుంది.
మిని ఫ్రిజ్, ఆటోమేటిక్ డోర్స్: సీట్ల మధ్య ఒక చిన్న ఫ్రిజ్, ఆటోమేటిక్ డోర్స్, ఫోల్డ్ చేయగల టేబుల్స్ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
అడ్వాన్స్ డ్ సేఫ్టీ : దీనితో పాటు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి అడ్వాన్స్ డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంతటి విలాసవంతమైన ఫీచర్లతో ఉన్న ఈ కారు యశ్ స్టార్ స్టేటస్‌కి సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు.