Sridevi : చేసింది ఒక్క సినిమానే.. కొత్త కారు కొన్న జాబిలి.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే ?

Sridevi : టాలీవుడ్‌లో ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న యువతారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి శ్రీదేవి చేరింది. నాని నిర్మాణంలో వచ్చిన కోర్టు సినిమాలో జాబిలి’ పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ క్యూట్ హీరోయిన్, తాజాగా ఒక లగ్జరీ కారు కొని వార్తల్లో నిలిచింది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌లు ఒక సినిమా హిట్టయితే చాలు, వారి లైఫ్‌స్టైల్ మొత్తం మారిపోతుంది. చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనే సంబంధం లేకుండా హిట్ టాక్ వస్తే చాలు, కొందరు విల్లాలు, ఆస్తులు కొంటే మరికొందరు ఖరీదైన కార్లు కొంటారు. ఇప్పుడు ఈ జాబితాలో శ్రీదేవి చేరిపోయింది.
నాని నిర్మాణంలో వచ్చిన కోర్టు సినిమాలో జాబిలి పాత్రలో నటించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన శ్రీదేవి తనకు ఒక ఖరీదైన కారు కొనాలనే కోరిక ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన కలను నిజం చేసుకుంటూ, ఆమె ఒక సరికొత్త ఎంజీ హెక్టర్ కారును కొనుగోలు చేసింది. ఈ లగ్జరీ కారు ధర సుమారు 25 లక్షల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. చాలా చిన్న వయసులోనే తన కలను నెరవేర్చుకున్నందుకు నెటిజన్లు ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు.
Read Also: Mental Stress : యువతకు పెరుగుతున్న మానసిక ఒత్తిడి.. దేశ భవిష్యత్తుకు ప్రమాదమా?
కోర్టు సినిమాకు శ్రీదేవికి పది లక్షలకు పైగానే రెమ్యునరేషన్ లభించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె అద్భుతమైన నటనకు అంత రెమ్యునరేషన్ ఇచ్చినా తప్పులేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీదేవికి సోషల్ మీడియాలో ఫాలోవర్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ యువ నటి అసలు పేరు శ్రీదేవి అపాలా. ఆమె స్వస్థలం ఏపీలోని కాకినాడ. కోర్టు సినిమాకు జాబిలి పాత్ర కోసం దర్శకుడు రామ్ జగదీష్ నటిని వెతుకుతున్న సమయంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి, ఈ పాత్రకు సరిపోతుందని నమ్మారు. వెంటనే ఆమె అడ్రస్ తెలుసుకొని, పిలిపించి ఆడిషన్ చేసి ఎంపిక చేశారు.
శ్రీదేవి ఈ సంవత్సరమే తన ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. సినిమాల్లోకి రావాలనే ఆసక్తితోనే తాను ఎక్కువ రీల్స్ చేస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి చెప్పింది. ఏదేమైనా, మొదటి సినిమాతోనే ఇంతటి క్రేజ్ రావడం మామూలు విషయం కాదు.
Read Also: Mental Stress : యువతకు పెరుగుతున్న మానసిక ఒత్తిడి.. దేశ భవిష్యత్తుకు ప్రమాదమా?
-
Yash : ‘బాస్’ నంబర్ ప్లేట్.. రూ.3 కోట్ల లగ్జరీ కారు.. యశ్ రేంజే వేరు
-
Nayanthara: మెగా 157లో నయనతార తీసుకునే రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా!
-
Court Movie : ఓటీటీలో కోర్ట్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
-
Tollywood Heroine: డాక్టర్ గా చేస్తూనే హీరోయిన్ గా కూడా ఫుల్ క్రేజ్.. ఫోటోలో బొద్దుగా ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..
-
Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్‌లో కోర్ట్ మూవీ
-
Meena : మీనా కూతురు ఎలా ఉందో తెలుసా.. చూస్తే షాక్ అవుతారు.. స్టన్నింగ్ లుక్స్..