Tollywood Heroine: డాక్టర్ గా చేస్తూనే హీరోయిన్ గా కూడా ఫుల్ క్రేజ్.. ఫోటోలో బొద్దుగా ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాక్టర్ కం యాక్టర్స్ గా మారిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వీళ్లు మెడికల్ విద్యను మధ్యలోనే వదిలేసి సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

Tollywood Heroine: ఈ ముద్దుగుమ్మలు ఒక వైపు డాక్టర్స్ గా సేవలు చేస్తూనే మరోవైపు క్రేజీ హీరోయిన్లుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా డాక్టర్. వైరల్ అవుతున్న ఫోటోలు ట్రెడిషనల్ చుడిదార్ లో బొద్దుగా ఉన్న అమ్మాయిని గుర్తుపట్టగలరా. ఈమె తెలంగాణ అమ్మాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపున సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లో చదువుకొని చైనాలో ఎంబిబిఎస్ పూర్తి చేసింది. అక్కడే ఈమె కొన్నాళ్ళు ఒక ఆసుపత్రిలో డాక్టర్ గా కూడా తన సేవలు అందించింది. ఆ తర్వాత మన దేశానికి తిరిగి వచ్చిన ఈ అమ్మడు అపోలో ఆసుపత్రిలో దాదాపు ఆరేళ్లు పనిచేసింది. తనకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఈమె నటనపై తనకు ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. స్టార్టింగ్లో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి మిస్ తెలంగాణగా విజయం సాధించింది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీలలో కూడా పాల్గొని ఫైనల్స్ వరకు వెళ్ళింది. మొదట్లో చిన్న చిన్న సినిమాలలో కీలక పాత్రలలో కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకుంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఈ చిన్నది తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఈ హీరోయిన్ మరెవరో కాదు కామాక్షి భాస్కర్ల. కామాక్షి 2022లో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రియురాలు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది మీనాక్షి. ఆ తర్వాత ఈమె తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మా ఊరి పొలిమేర, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, మా ఊరి పొలిమేర 2, ఓం భీమ్ బుష్ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. పొలిమేర సినిమాతో టాలీవుడ్ లో కామాక్షి బాగా ఫేమస్ అయ్యింది. ఇటు సినిమాలతో పాటు అటు వెబ్ సిరీస్ లలో కూడా ఈ చిన్నది సందడి చేస్తుంది.
ఝాన్సీ, దూత, సైతాన్ వంటి వెబ్ సిరీస్ లలో నటించి ఈమె మరింత పాపులర్ అయ్యింది. ఒకప్పుడు ఈమె చాలా బొద్దుగా ఉండేది. కానీ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కామాక్షి బరువు తగ్గిపోయి సన్నజాజి తీగల మారిపోయింది. సోషల్ మీడియాలో కామాక్షి చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం క్రేజీ ఫోటోలు షేర్ చేస్తే అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటూ ఉంటుంది. అలాగే కామాక్షి భాస్కర్ల ఏంజెల్ హౌస్, వాయిస్ 4 గర్ల్స్, మేక్ ఎ డిఫరెన్స్ వంటి ఎన్జీవోలలో కూడా పనిచేస్తుంది.
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Akkineni Nagarjuna : నాగార్జున కి తల్లిగా..నాగ చైతన్య కి లవర్ గా నటించిన ఏకైక హీరోయిన్!
-
Tollywood Heroine : రెండు జడలు వేసుకుని సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్న ఈ చిన్నారి టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్…ఎవరో గుర్తుపట్టారా..
-
Tollywood Heroine : అమ్మ చేతి గోరుముద్దలు తింటున్న ఏ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…
-
Tollywood Heroine : తెలుగులో ఒక్క సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది.. డాక్టర్ గా చేస్తూనే సినిమాల్లో హీరోయిన్ గా.. ఎవరో గుర్తుపట్టారా…
-
Meena : మీనా కూతురు ఎలా ఉందో తెలుసా.. చూస్తే షాక్ అవుతారు.. స్టన్నింగ్ లుక్స్..