Akkineni Nagarjuna : నాగార్జున కి తల్లిగా..నాగ చైతన్య కి లవర్ గా నటించిన ఏకైక హీరోయిన్!

Akkineni Nagarjuna :
నాగార్జున(Akkineni Nagarjuna) తల్లిగా నటించిన అమ్మాయి, నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కి లవర్ గా నటించడం ఏమిటి?, అసలు ఏమి మాట్లాడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ మన టాలీవుడ్ లో ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చాలానే వచ్చాయి. బాగా అలోచించి చూస్తే మీకే అర్థం అవుతుంది. అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించిన చిత్రం ‘మనం’. అక్కినేని నాగేశ్వర రావు(ANR) గారి చివరి చిత్రం కూడా ఇదే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన ICU బెడ్ మీద నుండే డబ్బింగ్ చెప్పారట. అందరికీ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాగేశ్వర రావు గారు ఏరోజున చనిపోతారు అనే విషయం పై క్లారిటీ ఉందట. నేను డబ్బింగ్ చెప్పాలి, నాకు ఎక్కువ సమయం లేదు అని మొండిపట్టు పట్టి నాగేశ్వర రావు గారు ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాడట. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇందులో నాగ చైతన్య, సమంత(Samantha Ruth Prabhu) లు అక్కినేని నాగార్జున కి తల్లిదండ్రులుగా నటిస్తారు. నాగార్జున చిన్న వయస్సులో ఉన్నప్పుడే వీళ్లిద్దరు కార్ ప్రమాదంలో చనిపోతారు. మళ్ళీ పునర్జన్మ ఎత్తుతారు. అప్పటికే ప్రేమించుకొని విడిపోయి ఉన్న తన తల్లిదండ్రులను పునర్జన్మలో ఒక్కటి చేసే పాత్రలో నాగార్జున కనిపిస్తాడు. అదే విధంగా అక్కినేని నాగేశ్వర రావు గారికి నాగార్జున, శ్రీయ తల్లిదండ్రులుగా నటిస్తారు. నాగేశ్వరరావు చిన్నతనం లో ఉన్నప్పుడే వీళ్లిద్దరు చనిపోతారు. పెద్దయ్యాక మళ్ళీ కలుసుకుంటారు. చాలా అద్భుతమైన స్టోరీ ఇది. అప్పట్లో కమర్షియల్ గా ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్, సుమారుగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం లో సమంత నాగార్జున కి తల్లిగా నటించడం, నాగ చైతన్య కి ప్రేమికురాలిగా నటించడం వినడానికి ఎంతో గమ్మత్తుగా ఉంది కదూ.
అలా ఒకే సినిమాలో నాగచైతన్య కి ప్రేయసి గా, నాగార్జున కి తల్లి గా నటించిన ఏకైక హీరోయిన్ గా సమంత రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈమధ్య కాలం లో ఈ సినిమా టీవీ టెలికాస్ట్ జరగడం లేదు. ఇది మూవీ లవర్స్ కి నిరాశ కలిగించే విషయం. చాలా మంది ఈ సినిమా పూర్తి స్టోరీ ని కూడా మర్చిపోయి ఉంటారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు ఒక సినిమా కూడా తెరకెక్కలేదు. ఇదే చిత్రం ఇప్పుడు విడుదల అయ్యుంటే బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ఉండేది. అక్కినేని కుటుంబం మొత్తం మళ్ళీ ప్లాన్ చేసుకున్నా ఇలాంటి అద్భుతమైన సినిమాని చేయలేరు. కేవలం అక్కినేని ఫ్యామిలీ నే కాదు, ఇండస్ట్రీ లోని మిగిలిన హీరోల ఫ్యామిలీస్ కి కూడా ఇలాంటి ప్రాజెక్ట్ సెట్ అవ్వడం చాలా కష్టం.
-
Samantha Finger Ring: సమంత వేలికి కనిపించిన స్పెషల్ రింగ్.. సోషల్ మీడియాలో వైరల్
-
Samantha And Raj: ఓకే కారులో సమంత – రాజ్ ఫొటోలు వైరల్
-
Samantha Dead Hang Challenge: సమంత డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్.. వీడియో వైరల్
-
Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Samantha : ఆ డైరెక్టర్ తో కలిసి షికార్లు చేస్తున్న సమంత.. ఫ్యాన్స్ సందేహాలు పటాపంచలు