Samantha : ఆ డైరెక్టర్ తో కలిసి షికార్లు చేస్తున్న సమంత.. ఫ్యాన్స్ సందేహాలు పటాపంచలు

Samantha : స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందనే వార్త చాలా కాలంగా వినిపిస్తుంది. అయితే, ఈ విషయాన్ని వారు ఇంతవరకు అధికారికంగా కన్ఫాం చేయలేదు. కానీ, తాజాగా వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలతో వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని వారు దాదాపుగా అంగీకరించినట్లు కనిపిస్తోంది. రాజ్, సమంత భుజంపై చేయి వేసి ఉండగా, సమంత ఆయన చేతిని పట్టుకుని ఉన్న క్యూట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అమెరికాలోని మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో తెలుగు సంఘం నిర్వహించిన తానా వేడుకకు సమంత, రాజ్ మరికొందరు హాజరయ్యారు. ఈ సమయంలో వారు అక్కడి వీధుల్లో సరదాగా గడిపారు. ఈ ఫోటోలను సమంత స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసుకుంది. చాలా చోట్ల రాజ్ నిడిమోరును ఈ ఫోటోల్లో చూడవచ్చు. దీంతో వీరిద్దరి సంబంధం దాదాపు ఖరారు అయ్యిందని అందరూ మాట్లాడుకుంటున్నారు.
Read Also:Money Saving : సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు ఉంచితే ఎంత నష్టమో తెలుసా ? మరి ఎక్కడ పెడితే లాభం?
సమంత, రాజ్ మొదటిసారిగా ది ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే, రాజ్‌కు అప్పటికే పెళ్లి అయింది. ఇంకా ఆయన తన భార్య నుంచి విడాకులు కూడా తీసుకోలేదు. అయినప్పటికీ, ఆయన సమంతతో కలిసి తిరుగుతున్నారు. వీరిద్దరూ భవిష్యత్తులో వివాహం చేసుకునే అవకాశం కూడా లేదని చెప్పలేం.
సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య ఇప్పటికే తన జీవితంలో మరో అడుగు వేశారు. ఆయన హీరోయిన్ శోభితా ధూళిపాళను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు సమంత కూడా తనకంటూ ఒక కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉంది. ఆమె ఎక్కడికి వెళ్లినా రాజ్‌తో కలిసి తిరుగుతోంది. ఎలాంటి భయం లేకుండా ఫోటోలను కూడా షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్, “సమంత అన్నీ కన్ఫర్మ్ చేసేసింది. ఇంకేం చెప్పాలి? ఇంత ఆత్మీయంగా ఉంటే లవర్ కాక మరేంటి?” అని ప్రశ్నిస్తున్నారు. అయితే, సమంత మాత్రం ఈ విషయంపై ఇంకా మౌనంగానే ఉంది.
Read Also:Blood Sugar : బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే ఈ పండ్లను తినొద్దు
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత
-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
-
Ananya Nagalla: బాలీవుడ్‌లోకి అనన్య నాగళ్ల ఎంట్రీ.. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఛాన్స్
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..