Money Saving : సేవింగ్స్ అకౌంట్లో డబ్బు ఉంచితే ఎంత నష్టమో తెలుసా ? మరి ఎక్కడ పెడితే లాభం?

Money Saving : ధనవంతులు కావాలంటే డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని సరైన చోట పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. చాలా మంది తమ కష్టార్జితాన్ని సేవింగ్స్ అకౌంట్లో ఉంచుతుంటారు. కానీ, అలా చేయడం వల్ల మీకు తెలియకుండానే పెద్ద నష్టం జరుగుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకు నష్టపోతారు?
సేవింగ్స్ అకౌంట్లలో బ్యాంకులు చాలా తక్కువ వడ్డీని (సుమారు 2.50 నుండి 2.75శాతం) మాత్రమే ఇస్తాయి. ఉదాహరణకు రూ.లక్షకు సంవత్సరానికి రూ.200-రూ.250 మాత్రమే వడ్డీ వస్తుంది. అయితే, ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం దాదాపు 6శాతంగా ఉంది. దీనివల్ల మీ డబ్బుకు వచ్చే వడ్డీ కంటే వస్తువుల ధరలు వేగంగా పెరుగుతాయి. అంటే, వాస్తవానికి మీ డబ్బు విలువ ఏటా సుమారు 3శాతం మేర తగ్గుతున్నట్లే లెక్క. ఈ పెరుగుతున్న ధరల మధ్య సేవింగ్స్ అకౌంట్లో డబ్బు ఉంచడం తెలివైన పని కాదు.
Read Also:Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
సేవింగ్స్ అకౌంట్లో ఎంత డబ్బు ఉండాలి?
సేవింగ్స్ అకౌంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి వీలుగా కేవలం 3 నుంచి 6 నెలల అత్యవసర ఖర్చులకు సరిపడా డబ్బును మాత్రమే ఉంచుకోవాలి. ఇది మీకు ఏదైనా అనుకోని ఖర్చు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. మిగిలిన మీ పొదుపు మొత్తాన్ని మంచి పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మేలు.
పెట్టుబడికి ఉత్తమ మార్గాలు ఏవి?
మీ డబ్బును సురక్షితంగా, లాభదాయకంగా పెట్టుబడి పెట్టడానికి కొన్ని మార్గాలున్నాయి. అవి
బ్యాంక్ ఎఫ్డీలు : సేవింగ్స్ అకౌంట్ కంటే ఎక్కువ వడ్డీనిస్తాయి, సురక్షితమైనవి.
పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్: పీపీఎఫ్, ఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్, కేవీపీ వంటి పథకాలు మంచి రాబడినిస్తాయి, సురక్షితమైనవి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి కాబట్టి వీటి మీద నమ్మకం పెట్టుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్: దీర్ఘకాలిక పెట్టుబడికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. నిపుణులైన ఫండ్ మేనేజర్లు మీ డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టి మంచి రాబడిని సాధిస్తారు. సిప్ ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవచ్చు. మీ టార్గెట్లకు తగ్గట్టుగా సరైన పథకాన్ని ఎంచుకోవడానికి ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Read Also:Blood Sugar : బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే ఈ పండ్లను తినొద్దు
-
Financial Freedom:నెలాఖరున డబ్బుల్లేక ఇబ్బందా? ధనవంతులు కావాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి
-
RBI : ఆర్బీఐ కొత్త రూల్.. పదేళ్లు దాటిన పిల్లలకు గుడ్ న్యూస్
-
Post Office Scheme: బెస్ట్ స్కీమ్ భయ్యా.. రూ.100 డిపాజిట్ చేస్తే లక్షలు
-
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. కొన్నేళ్లలో కోటీశ్వరులు మీరే
-
Invest: మ్యూచువల్ ఫండ్‌లో దీర్ఘకాలికంగా పెట్టుబడులు ఎందుకు పెడతారు?
-
Bangladesh : సామాన్యుడికి షాక్.. అక్కడ చికెన్ కంటే గుడ్డు ధర ఎక్కువ