Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. కొన్నేళ్లలో కోటీశ్వరులు మీరే

Mutual Funds: డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే మనం ఏ మార్గాన్ని ఎంచుకున్నామన్నది ముఖ్యం. అయితే ఎక్కువ సమయంలో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ చాలా బెటర్. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలికంగా లాభాలు వస్తాయి. అయితే చాలా మంది దీర్ఘకాలికంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? దీని వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ప్రమాదం తక్కువ, లాభం ఎక్కువ
ఏ పెట్టుబడిలోనైనా లాభం ఎక్కువ రావాలంటే, ప్రమాదం కూడా ఎక్కువే ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెడితే ఈ రిస్క్ తగ్గుతుంది. లాభం వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టిన వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఇతర సంప్రదాయ పెట్టుబడుల కంటే మెరుగైన లాభాలు వచ్చాయి. మార్కెట్ ఒడిదుడుకులు దీర్ఘకాలంలో స్థిరపడతాయి. కాబట్టి నష్టాలు తగ్గి, రాబడులు పెరుగుతాయి. అయితే ఉదాహరణకు మీరు ఒక సంవత్సరంలో చూస్తే మార్కెట్ బాగా పడిపోవచ్చు, కానీ 5 లేదా 10 సంవత్సరాల కాలంలో మార్కెట్ కోలుకొని మంచి వృద్ధిని సాధిస్తుంది. కాబట్టి దీర్ఘకాలికంగా పెడితే లాభాలు వస్తాయి.
డైవర్సిఫికేషన్
మ్యూచువల్ ఫండ్స్‌లో మీ డబ్బును ఒకే కంపెనీలో లేదా ఒకే రంగంలో కాకుండా అనేక కంపెనీలలో, వివిధ రంగాల్లో, ఆస్తులలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. ఉదాహరణకు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మీ డబ్బును బ్యాంకింగ్, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఆటోమొబైల్స్ వంటి రకరకాల రంగాల్లోని కంపెనీల షేర్లలో పెడుతుంది. ఒక రంగం లేదా కంపెనీ నష్టపోయినా మిగిలినవి లాభాలను అందించడం వల్ల మీ మొత్తం పెట్టుబడిపై ప్రభావం తక్కువగా ఉంటుంది.
దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుకూలం
రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భద్రత, పిల్లల ఉన్నత విద్య, పెళ్లి, ఇల్లు కొనడం వంటివి చేస్తుంటారు. అయితే ఈ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి చాలా అనుకూలంగా ఉంటుంది. 10, 15, 20 సంవత్సరాలకు పైగా పెట్టుబడి పెట్టడం వల్ల, కాంపౌండింగ్ (చక్రవడ్డీ) ప్రభావం వల్ల మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. చిన్న మొత్తాలతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ప్రతి నెలా పెట్టుబడి పెడుతూ పోతే దీర్ఘకాలంలో మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు.
అక్సెసిబిలిటీ, లిక్విడిటీ
మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. కొన్ని ఫండ్స్‌లో కేవలం రూ.100 కి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌కు మంచి లిక్విడిటీ కూడా ఉంటుంది. అంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు చాలా సులభంగా, తక్కువ సమయంలో మీ పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. మీరు విత్ డ్రా కోసం దరఖాస్తు చేసిన రెండు లేదా మూడు పని దినాల్లో డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
-
Money Saving : సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు ఉంచితే ఎంత నష్టమో తెలుసా ? మరి ఎక్కడ పెడితే లాభం?
-
Stress Relief: ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. ఈ టైప్ ధ్యానం తప్పనిసరి
-
Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?
-
Mutual Funds: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడం ఎలా?
-
Rain water: వర్షపు నీటితో స్నానం చేస్తే.. ఇన్ని ప్రయోజనాలా!
-
International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!