Stress Relief: ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. ఈ టైప్ ధ్యానం తప్పనిసరి

Sress Relief: వ్యక్తిగత సమస్యలు, వర్క్ బిజీ వల్ల చాలా మంది ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతున్నారు. ఎప్పుడో ఒకసారి ఒత్తిడిగా అనిపిస్తే పర్లేదు. కానీ కొందరికి ఎక్కువగా టెన్షన్ అనిపిస్తుంది. దీంతో ప్రతీ పని చేసేటప్పుడు చాలా చిరాకుగా ఉంటారు. ఏ పనిని కూడా ఏకాగ్రతతో చేయలేరు. వీరి మెదడు పనితీరు కూడా బాగా తగ్గిపోతుంది. ఏ విషయం గురించి కూడా లోతుగా ఆలోచించలేరు. అధికంగా ఇలా ఒత్తిడికి గురైతే మాత్రం మానసిక సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవే కాకుండా అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్, గుండె పోటు, మెదడు సమస్యలు వంటి వాటికి కూడా దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి తప్పకుండా మెడిటేషన్ చేయాలి. అయితే అన్ని ధ్యానాలు కాకుండా ఈ టైప్ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారని నిపుణులు అంటున్నారు. మరి ఎలాంటి ధ్యానం చేస్తే ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారో ఈ స్టోరీలో చూద్దాం.
మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం
ధ్యానాల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే ఒత్తిడి తగ్గాలంటే మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం తప్పకుండా చేయాలని నిపుణులు చెబుతున్నారు. డైలీ ఒక 20 నిమిషాల పాటు అయినా కూడా ఈ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారని నిపుణులు అంటున్నారు. ఈ ధ్యానం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఎలాంటి ఒత్తిడి, ఆందోళన ఉన్నా కూడా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం వల్ల శారీరక సమస్యలు కూడా రావు. కండరాలు బలంగా తయారు అవుతాయని నిపుణులు అంటున్నారు.
శారీరక శ్రమ
ఒత్తిడి తీవ్రంగా ఉంటే శారీరక శ్రమ చేయడం వల్ల తగ్గుతుంది. ఏవైనా బరువులు ఎత్తడం, స్కిప్పింగ్, యోగా, వ్యాయామం వంటివి చేయాలి. ఈ శారీరక శ్రమ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శారీరక శ్రమ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఏకాగ్రత పెరగడం, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.
నిద్ర
ఒత్తిడి అధికంగా ఉంటే మాత్రం కాస్త సమయం పెట్టి నిద్రపోవాలి. రోజువారీ కంటే కాస్త ఎక్కువ సమయం నిద్రపోవపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బాడీకి సరిపడా నిద్రపోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా కూడా స్ట్రాంగ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
పోషకాలు ఉండే ఫుడ్స్
ఒత్తిడితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎక్కువగా పండ్లు, తాజా కూరగాయలు, ప్రొటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.
అందరితో కలిసి మెలసి ఉండాలి
ఒంటరిగా ఉండకుండా అందరితో కలిసి ఉండటం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. కలిసి మాట్లాడటం, సరదాగా బయటకు వెళ్లడం వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Jabardasth Nukaraju: వేరే అబ్బాయితో ఆసియా పెళ్లి.. గుండె పగిలేలా ఎక్కి ఎక్కి ఏడ్చిన జబర్దస్త్ నూకరాజు
-
Stress relief: అందంగా ఉండాలంటే చిట్కాలే కాదు.. ఒత్తిడిని కూడా జయించాల్సిందే
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?
-
Rain water: వర్షపు నీటితో స్నానం చేస్తే.. ఇన్ని ప్రయోజనాలా!
-
International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!
-
Yoga: యోగా చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేశారో.. అంతే సంగతులు