Rain water: వర్షపు నీటితో స్నానం చేస్తే.. ఇన్ని ప్రయోజనాలా!

Rain water: వర్షం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎప్పుడైనా చిన్న చినుకులు పడితే చాలు.. వెంటనే ఆ వర్షంలో తడుస్తారు. ఇలా వర్షంలో తడవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయనే విషయం తెలిసినా కూడా చాలా మంది అదే పని చేస్తారు. అయితే పూర్వం ఎక్కువగా వర్షం నీటిని ఉపయోగించేవారు. వర్షాలు వస్తే ఆ నీటిని పట్టుకుని వాటితో స్నానం, సామానులు క్లీన్ చేయడం వంటివి చేసేవారు. కానీ ఇప్పుడు రోజుల్లో అసలు వర్షం నీరు పట్టుకోరు. వీటితో ఎలాంటి ప్రయోజనం ఉండదని వదిలేస్తారు. కానీ వర్షం నీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అసలు ఈ వర్షం నీటితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎలా ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిది? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వర్షం నీటిని సేకరించి వాటిని శుభ్రమైన పాత్రలో ఉంచాలి. ఈ నీరు మంచిగా ఉంటే స్నానం చేయవచ్చు. దీనివల్ల ఒంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది. అలాగే ఈ వర్షం నీటిలో కాస్త సాధారణ వాటర్ కలిపి ఇంట్లో చల్లడం వల్ల శరీరం నుంచి ప్రతికూల శక్తి అంతా కూడా తొలగిపోతుంది. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొందరికి రాహువు, కేతువు వల్ల సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ఈ వర్షం నీటితో స్నానం చేయడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుందని, ఉన్న సమస్యలు అన్ని కూడా తీరపోతాయని అంటున్నారు. అలాగే ఈ వర్షం నీటిని శనివారం లేదా అమావాస్య రోజుల్లో ఇంట్లోని గుమ్మాల దగ్గర చల్లడం వల్ల ఆనందం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే ఇంట్లో ఇప్పటి వరకు ఉన్న గొడవలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు అంటున్నారు. కొందరు ఏ పని చేపట్టినా కూడా జరగదు. ప్రతీ రోజు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వర్షపు నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి నైవేద్యం పెట్టాలి. ఇలా చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉండి.. కోరిన కోరికలు అన్ని కూడా తీరుతాయని నిపుణులు అంటున్నారు.
కొందరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే వారు శ్రీ యంత్రాన్ని లేదా లక్ష్మీ యంత్రాన్ని వర్షపు నీటితో కడగాలి. ఆ తర్వాత దానిపై గంధపు చెక్క లేదా కుంకుమ పువ్వు తిలకం పెట్టాలి. దీనివల్ల ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని నిపుణులు అంటున్నారు. అయితే అన్ని రోజులు కాకుండా కేవలం శుక్రవారం నాడు ఇలా చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also read : International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!
-
Life Lessons: లైఫ్ ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారా.. ఈ స్టోరీ వినండి మీకోసమే!
-
Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
-
Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం