Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!

Healthy Food : మన ఆరోగ్యం వ్యాధుల నుండి విముక్తి పొందాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. ఎలా తినాలి, ఎంత తినాలి, ఏ వయసులో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని ఆయుర్వేదం చాలా స్పష్టంగా వివరించింది.. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆహార నియమాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ‘మన శరీరం, అలాగే మనల్ని పీడించే వ్యాధులు రెండూ ఆహారం నుంచే పుట్టుకొస్తాయి’ అని ఆయుర్వేదం చెబుతుంది. సరైన పద్ధతిలో తీసుకుంటే ఆహారం ఆరోగ్యాన్ని పెంచుతుంది. లేదంటే రోగాలను తెచ్చిపెడుతుంది. అందుకే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
ఆయుర్వేదం ప్రకారం, కడుపు నిండా తినకూడదు. జీర్ణాశయాన్ని మూడు భాగాలుగా విభజించుకొని, ఒక భాగం ఘన పదార్థాలు, ఒక భాగం ద్రవాలు తీసుకోవాలి. మిగతా భాగం ఖాళీగా ఉంచాలి. దీనిని త్రిభాగ సౌహిత్యం అంటారు. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే సగం కడుపు నిండా తీసుకోవచ్చు. భోజనం చేసేటప్పుడు ఒకేసారి నీళ్లు తాగకుండా, మధ్యమధ్యలో కొద్దికొద్దిగా తాగాలి. ఇది ఆహారం సరిగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. భోజనానికి ముందు ఐదు ముద్దల్లో కొద్దిగా నెయ్యి వేసుకుని తినడం జీర్ణాగ్నిని పెంచి, అన్నవాహికను మృదువుగా చేస్తుంది. ఫాస్టుగా గానీ, లేటుగా గానీ తినకూడదు. అలాగే, భోజనం చేసేటప్పుడు ఫోన్, టీవీ వంటి వాటికి బదులు ఆహారంపైనే దృష్టి పెట్టాలి. వేడి వేడి ఆహారం తినడం వల్ల రుచిగా ఉండటమే కాకుండా త్వరగా జీర్ణమవుతుంది. ఒక భోజనానికి, మరొక భోజనానికి మధ్య కనీసం 3 గంటల సమయం ఉండాలి.
Read Also:Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
వృద్ధాప్యంలో జీర్ణ శక్తి మందగిస్తుంది. దీనికి కారణం వాత ప్రకోపం. దీనివల్ల ఆకలి, జీర్ణశక్తి తగ్గుతాయి. వృద్ధులు ఆకలిగా అనిపిస్తే కొంచెం కొంచెంగా నాలుగైదు సార్లు తినవచ్చు. రాత్రిపూట తేలికైన ఆహారం తీసుకోవాలి. జీర్ణ సమస్యలు లేకపోతే అన్నంలో కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని తినడం మేలు. భోజనానికి ముందు గోరువెచ్చటి నీళ్లు తాగడం వల్ల ఆహారం సులభంగా లోపలికి వెళ్తుంది. రాగుల మొలకల పొడి, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. పాత బియ్యం, గంజి, చారు జీర్ణక్రియకు మంచివి. పుల్లటి పండ్లు జీర్ణ సమస్యలు ఉన్నవారికి సరిపడవు. మునగాకు, మునక్కాడలు వాత ప్రకోపాన్ని తగ్గిస్తాయి. వృద్ధాప్యంలో తేనె ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.
వృద్ధాప్యంలో జీర్ణక్రియను మెరుగుపరచడానికి సోంపు, జీలకర్ర కలిపిన నీటిని తాగవచ్చు. వేయించిన జీలకర్ర పొడిని నీటిలో కలుపుకొని తాగడం కూడా మేలు చేస్తుంది. ఉసిరికాయ జీర్ణ క్రియను బలపరుస్తుంది. అల్లం రసం లేదా అల్లం ముక్క నోట్లో పెట్టుకోవడం ఆకలిని పెంచుతుంది. చవన్ ప్రాష్ వంటి ఆయుర్వేద ఔషధాలు ఆకలి పెరగడానికి తోడ్పడతాయి. బ్రాహ్మీ రసాయనం, అశ్వగంధావలేహ్యం వంటివి కూడా వైద్యుల సలహా మేరకు తీసుకోవచ్చు.
Read Also:Google New Feature: గూగుల్ సెర్చింగ్‌లో ఈ కొత్త ఫీచర్ గమనించారా.. ఇక బ్రౌజర్లకు పండగే
-
Mango : శృంగారంపై ఆసక్తిని పెంచే ఈ పండు గురించి తెలుసా?
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
-
Weight Loss : రాకెట్ కంటే వేగంగా మీ బరువు తగ్గిస్తుంది.. ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయండి
-
Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం
-
Cancer : మాటిమాటికీ గ్యాస్, మలబద్ధకం క్యాన్సర్‌కు కారణమట.. జాగ్రత్త పడకపోతే కష్టమే!