Google New Feature: గూగుల్ సెర్చింగ్‌లో ఈ కొత్త ఫీచర్ గమనించారా.. ఇక బ్రౌజర్లకు పండగే

Google New Feature: గూగుల్ ఉపయోగించని వారు ప్రస్తుతం ఎవరూ ఉండరు. ఎందుకంటే అందరూ కూడా స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. ఖాళీగా ఉంటే చాలు.. ఏదో ఒకటి బ్రౌజింగ్ చేస్తూనే ఉంటారు. ఈ రోజుల్లో అయితే ఖాళీగా లేకపోయినా కూడా మొబైల్ మాయలో పడి ఏదో ఒకటి సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందనే ప్రతీ విషయం కూడా ఈ గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఏఐ వచ్చేసింది. దీంతో అందరూ కూడా ఇదే వాడుతున్నారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఎందులో చూసిన కూడా ఏఐ కనిపిస్తోంది. ప్రస్తుతం చాలా మంది కూడా ఈ ఏఐని వాడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా వర్క్ విషయాలు అన్ని తెలుసుకోవడానికి ఈ ఏఐని వినియెగిస్తున్నారు.
ఈ ఏఐని వినియోగించాలంటే గూగుల్ నుంచి ఏఐ, గూగుల్ జెమిని, చాట్ జీపీటీ ఇలా సెర్చ్ చేసి లాగిన్ అయిన తర్వాత వివరాలను ఇస్తుంది. కానీ ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఇంత ఇబ్బంది పడకుండా డైరెక్ట్‌గా యూజ్ చేసేందుకు గూగుల్ సెర్చ్‌లోనే ముందుగా ఏఐ మోడ్ వచ్చింది. మీరు ఏదైనా గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఆల్, ఇమేజెస్స్, వీడియోలు, న్యూస్ ఇలా ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన దాంట్లోకి మీరు వెళ్లి ఆర్టికల్స్ వెతుక్కోవచ్చు. అయితే ఇప్పుడు దీనికి ముందుగా ఏఐ మోడ్‌ను ఇచ్చింది. వీటిన్నింటి కంటే ఏఐ మోడ్ అని వచ్చి ఆ తర్వాత ఈ ఆప్షన్లు ఉంటాయి. మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఇందులోకి వెళ్లి సెర్చ్ చేస్తే అన్ని వివరాలను ఇస్తుంది. కాకపోతే తెలుగులో అయితే ఇవ్వడం లేదు. త్వరలో దీన్ని కూడా అప్డేట్ చేయనున్నారు. కానీ ప్రస్తుతం ఇంగ్లీషులో అయితే మీరు అడిగిన అన్ని కూడా ఇవ్వనుంది. మీరు దేని గురించి అయినా అడిగితే దానికి సంబంధించిన వెబ్‌సైట్లు ఇలా అన్ని విషయాలను కూడా ఇస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్‌లోకి రావడంతో యూజర్లు ఆనందపడుతున్నారు. వేరే యాప్, వెబ్‌సైట్‌లోకి వెళ్లకుండా ఈజీగా ఉంటుందని భావిస్తున్నారు.
ఏఐ వల్ల చాలా మంది వర్క్‌ను తొందరగా ఫినిష్ చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువగా హార్డ్ వర్క్ చేయక్కర్లేదు. సరిగ్గా మీరు ప్రాప్ట్ కనుక ఇస్తే ప్రతీదీ కూడా వస్తుంది. తినే ఫుడ్ నుంచి మీరు చేసే ప్రతీ వర్క్‌కి సంబంధించినది కూడా ఇస్తుంది. ఈ ఏఐ వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు తగ్గుతాయని, చాలా మంది ఉద్యోగాలతో ఇబ్బంది పడతారని అంటున్నారు. కానీ ఏఐ వస్తు కొన్ని ఉద్యోగాలు మాత్రమే తొలగిపోతాయని, అన్ని కాదని మరికొందరు భావిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏఐ వల్ల ఏం అవుతుందో మరి చూడాలి.
Also read: SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Mahindra : నెక్సాన్, బ్రెజ్జాకు గట్టిపోటీ.. మహీంద్రా చౌకైన కారు అప్ డేటెడ్ వెర్షన్ వస్తోంది
-
YouTube : యూట్యూబ్ రూల్స్‌లో భారీ మార్పులు.. లైవ్ స్ట్రిమింగ్ కు కొత్త నిబంధనలు
-
Password Leak : 1600కోట్ల గూగుల్, యాపిల్ పాస్ వర్డ్ లు లీక్ అయ్యాయట.. తస్మాత్ జాగ్రత్త
-
Mobile Apps: అన్‌ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ కూడా మీ డేటాను దొంగిలిస్తున్నాయా? ఇలా స్టాప్ చేయండి
-
Google Maps : ఇక లొకేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు.. గూగుల్ ఫోటో చూసి చెప్పేస్తుంది!