YouTube : యూట్యూబ్ రూల్స్‌లో భారీ మార్పులు.. లైవ్ స్ట్రిమింగ్ కు కొత్త నిబంధనలు

YouTube : యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్‌లు చూస్తుంటారా? లేదా మీ పిల్లలు లైవ్ స్ట్రీమ్‌లు చేస్తుంటారా? అయితే అలాంటి వాళ్లకు అలర్ట్. యూట్యూబ్ తన లైవ్ స్ట్రీమింగ్ నియమాలను మార్చబోతోంది. గూగుల్ ఈ నియమాలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నియమాలు అమల్లోకి వచ్చాక, ఇకపై అందరూ లైవ్ స్ట్రీమ్ చేయలేరు. పిల్లలకు మరింత భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి కనీస వయస్సు 13 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు దాన్ని 16 సంవత్సరాలకు పెంచారు. ఈ కొత్త నియమం వచ్చే నెల జులై 22 నుంచి అమల్లోకి వస్తుంది.
కొత్త నియమాల ప్రకారం, 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇకపై లైవ్ స్ట్రీమ్ చేయలేరు. ఈ చర్యను ఎందుకు తీసుకున్నారో యూట్యూబ్ చెప్పుకొచ్చింది. మైనర్ల భద్రతను పెంచడానికి, ఆన్లైన్ ప్రేక్షకులతో కనెక్ట్ అయినప్పుడు పిల్లలు ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గించడానికి ఈ చర్య తీసుకున్నట్లు యూట్యూబ్ పేర్కొంది.
Read Also : Railway Track Car Driving: తప్ప తాగి రైల్వే ట్రాక్ ఎక్కిన యువతి.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు!
కొత్త నియమాలు అమల్లోకి వచ్చినా కూడా 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న టీనేజర్లు లైవ్ స్ట్రీమ్‌లో కనిపించడానికి అనుమతి ఉంటుంది. అయితే, దీనికి కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. ఆ షరతు ఏమిటంటే, వారు ఒక పెద్ద వ్యక్తితో కలిసి మాత్రమే కెమెరా ముందు లైవ్ స్ట్రీమ్ చేయగలరు. అలా చేయని పక్షంలో యూట్యూబ్ లైవ్ చాట్‌ను నిలిపివేస్తుంది లేదా లైవ్ స్ట్రీమ్‌ను పూర్తిగా తొలగిస్తుంది.
గూగుల్ తీసుకున్న ఈ కొత్త పాలసీ తల్లిదండ్రుల సహాయం లేకుండా సొంతంగా లైవ్ స్ట్రీమ్ చేయాలనుకునే పిల్లలకు ఇబ్బందులు సృష్టించవచ్చు. ఇకపై, కొత్త నియమాల ప్రకారం, మీరు తల్లిదండ్రులను లేదా మరేదైనా పెద్ద వ్యక్తిని మీ ఛానెల్‌కు మేనేజర్‌గా చేర్చాల్సి ఉంటుంది. యూట్యూబ్ విధానంలో ఈ పెద్ద మార్పు పిల్లల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై ఆధారపడి ఉంది. ఈ కొత్త ఆంక్షల వల్ల కొంతమంది యువ యూట్యూబర్లు నిరాశ చెందవచ్చు. కానీ, మైనర్ల భద్రత తమకు అత్యంత ముఖ్యమని యూట్యూబ్ స్పష్టం చేసింది.
Read Also :UAE Attracts Rich : కోటీశ్వరులంతా ఆ ముస్లిం దేశానికే ఎందుకు వెళ్తున్నారు?
-
Dangerous Video : వీడిని బొక్కలో వేసి తుక్కుతుక్కుగా కొట్టాలి.. రెండేళ్ల చిన్నారితో బంగీ జంప్ ఏంట్రా
-
Password Leak : 1600కోట్ల గూగుల్, యాపిల్ పాస్ వర్డ్ లు లీక్ అయ్యాయట.. తస్మాత్ జాగ్రత్త
-
Viral Video : నువ్వేం తండ్రివిరా నాయనా.. ఆ పిల్లాడిని సింహానికి ఆహారంగా వేద్దాం అనుకుంటున్నావా ?
-
Mobile Apps: అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ కూడా మీ డేటాను దొంగిలిస్తున్నాయా? ఇలా స్టాప్ చేయండి
-
Android 16 : ఆండ్రాయిడ్ 16తో దొంగలకు షాక్.. ఫోన్ దొంగిలిస్తే అంతే సంగతులు!
-
Google Maps : వామ్మో గూగుల్ మ్యాప్స్ వల్ల ఇన్ని అనర్థాలు జరిగాయా? గుడ్డిగా నమ్మవద్దా?